తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్‌ 'ప్రత్యేక విడత'కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగ‌స్టు 22తో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 19 వేలకుపైగా విద్యార్థులు ఆప్షన్లు నమోదుచేసుకున్నారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్నవారిలో ఎక్కువమంది చివరి విడత కౌన్సెలింగ్‌లోనే సీటు పొంది, కళాశాలల్లో రిపోర్ట్‌ చేసిన వారే ఉండటం విశేషం. ఎంసెట్‌ చివరి విడతలో 64 వేల మందికిపైగా కళాశాలల్లో చేరేందుకు రిపోర్ట్‌ చేశారు.


ప్రత్యేక విడతలో ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి ఆగ‌స్టు 26న సీట్లను  కేటాయించనున్నారు. వీరు ఆగ‌స్టు 26 నుంచి ఆగస్టు 28 మధ్య నిర్ణీత ట్యూష‌న్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగ‌స్టు 27 నుంచి ఆగ‌స్టు 29 మధ్య సంబంధిత కళాశాలలో నేరుగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 26 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.


ALSO READ:


బీడీఎస్‌ సీట్ల భర్తీకి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడిక్ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా బీడీఎస్‌ ప్రవేశాలకు సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రారంభించింది. విద్యార్థులు ఆగస్టు 24న ఉదయం 10 గంటల నుంచి ఆగ్టు 26న మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్‌ జాబితా, అదేవిధంగా కళాశాల వారీగా సీట్ల (సీట్ మ్యాట్రిక్స్) వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఉన్నత విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీకి మార్గం 'జామ్', పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునే వారికోసం ఉద్దేశించిన ‘జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) 2024’ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభంకానుంది. సంబంధిత సబ్జెక్ట్‌లతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 13 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఐఐటీ మద్రాస్ ఈ ఏడాది 'జామ్' పరీక్ష నిర్వహించనుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో కొత్త పీజీ కోర్సు అందుబాటులోకి, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (JNAFAU)లో కొత్త పీజీ (మాస్టర్స్) కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఎనర్జీ అండ్‌ సస్టైనబుల్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ పేరుతో కొత్త మాస్టర్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు శనివారం నాడు ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి విద్యాసంస్థ ఇదేనని వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.కవితా దర్యాణిరావు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమ, సబ్జెక్ట్‌ నిపుణుల సహకారంతో ఈ కోర్సును రూపొందించబడిందని, కోర్సులో 20 మందికి ప్రవేశాలను కల్పించనున్నట్లు తెలిపారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..