తెలంగాణలో మే 20న నిర్వహించనున్న ఈసెట్‌-2023 ప్రవేశ ప‌రీక్షకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండు సెష‌న్లలో ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. మే 20న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో ఈసెట్ ప్రవేశ ప‌రీక్షలు నిర్వహించనున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. 


ఈసెట్ ప్రవేశ ప‌రీక్షకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు మే 19న ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్ ఈ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. రెండు సెష‌న్లకు అనుగుణంగా సిటీ బస్సులు నడిపిస్తామన్నారు. బస్సుల రాకపోకలు గురించి తెలుసుకోవడం కోసం కోఠిలో 9959226160, రేతిఫైల్‌ బస్టాండ్‌లో 9959226154 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.


ఈసెట్ పరీక్ష కోసం హైదరాబాద్‌లో 40 పరీక్ష కేంద్రాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో 44, ఏపీలో 7 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు. 


పరీక్ష విధానం:



ముఖ్యమైన తేదీలు..


➥ నోటిఫికేషన్ వెల్లడి: 01.03.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02-03-2023. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02-05-2023. (08-05-2023 వరకు పొడిగించారు)


➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 11-05-2023.


➥ రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 13-05-2023.


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 08-05-2023 నుంచి 13-05-2023 వరకు.


➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 16-05-2023.


➥ ఈసెట్ పరీక్ష తేది: 20-05-2023.


పరీక్ష సమయం: ఉ. 09:00 - మ.12:00 (ECE, EIE, CSE, EEE, CIV, MEC, CHE, MIN, MET, PHM, BSM)


Notification


Also Read:


సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష తేదీలివే!
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేవశాలకు నిర్వహించే 'కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ-2023' పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 21 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు; అదేవిధంగా.. జూన్‌ 5, 6 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతానికి మే 21, 22, 23, 24 తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్‌ కార్డులను మాత్రమే ఎన్టీఏ విడుదల చేసింది. మిగతా తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులను త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు.
CUET UG - 2023 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..


నిఫ్టెమ్‌లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సులు - వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన హరియాణా(సోనిపట్‌)లోని ''నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్‌ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్‌)'' సంస్థ 2023-2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించాను. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..