ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 3, 4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పలితాలను అందుబాటులో ఉంచారు. యూనివర్సిటీ పరిధిలో డిసెంబరు 29 నుంచి జనవరి 21 వరకు బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ సెమిస్టర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్‌టికెట్ వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు.
వెబ్‌సైట్
ఫలితాలు ఇలా చూసుకోండి..
స్టెప్-1: ఫలితాల కోసం విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - osmania.ac.in
స్టెప్-2: అక్కడ హోంపేజీలో 'Semester 3 and 4 result' లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్-3: ఫలితాలకు సంబంధించిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్-4: విద్యార్థులు తమ హాల్‌టికెట్ వివరాలు నమోదుచేయాలి.
స్టెప్-5: 3, 4 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
స్టెప్-6: ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తపరచుకోవాలి.
పరీక్షల ఫలితాలు ఇలా..
Result Name | Date of Release |
---|---|
BA(CBCS) (Regular) 3 and 5 th Sem Dec-2022 Results | 27-02-2023 |
BBA(CBCS) (Regular) 3 and 5 th Sem Dec-2022 Results Server-I Server-II |
27-02-2023 |
B.Com(CBCS) (Regular) 3 and 5 th Sem Dec-2022 Results Server-I Server-II |
27-02-2023 |
B.Sc(CBCS) (Regular) 3 and 5 th Sem Dec-2022 Results Server-I Server-II |
27-02-2023 |
నీట్ పీజీ-2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ పీజీ)-2023 అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ఫిబ్రవరి 27న విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నీట్ పీజీ-2023 పరీక్ష యథాతదంగా మార్చి 5న కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనుంది.
నీట్ పీజీ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
సీపెట్ అడ్మిషన్ టెస్ట్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) 2023 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల ప్రవేశాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కోర్సు అనుసరించి పదవతరగతి, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250. నార్త్ ఈస్ట్రర్న్ రిజీయన్ అభ్యర్థులు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. కంప్యూటర్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..