తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఎస్‌ సెట్‌)-2023 పరీక్ష హాల్‌టికెట్లను ఉస్మానియా యూనివర్సిటీ అక్టోబరు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. టీఎస్ సెట్‌-2023 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్టికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 28 - 30 వరకు టీఎస్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు ప్రభుత్వం ఏటా టీఎస్‌ సెట్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణ బాధ్యతను ఉస్మానియా విశ్వవిద్యాలయం చేపట్టింది. 


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం: మొత్తం 29 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. 


సబ్జెక్టులు: జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.


పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి.


ALSO READ:


విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, ఫెలోషిప్‌ సాయం పెంపు - ఎప్పటినుంచి వర్తిస్తుందంటే?
విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్‌ల కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పెంచింది. దీనివల్ల దేశంలోని దాదాపు 31 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చూకూరనుంది. 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. 2023, జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది. పెరిగిన ఈ ఫెల్‌షిప్ మొత్తాలు ప్రస్తుతం యూజీసీ నుంచి ఫెలోషిప్స్ పొందుతున్నవారికి మాత్రమే వర్తించనున్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


యూజీసీ 'వాట్సాప్‌ ఛానల్‌' ప్రారంభం, విద్యార్థులకు మరింత చేరువగా సేవలు
దేశంలోని ఉన్నత విద్యాసంస్కరణల్లో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు మరియు అధ్యాపకులు మరియు ఇతర వాటాదారులందరితో అనుసంధానం కోసం కొత్త వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 'యూజీసీ వాట్సాప్ ఛానెల్‌'ను ప్రారంభించింది. అందరికీ అధికారిక సమచారాన్ని వేగంగా అందించడం కోసం దీన్ని ప్రారంభించినట్లు ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. యూజీసీ ఇండియా వాట్సాప్ ఛానెల్‌ని ప్రారంభించడం అనేది మరింత సమగ్రమైన మరియు సమాచారంతో కూడిన ఉన్నత విద్యా రంగాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన అన్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...