TG LAWCET & TS PGLCET - 2024 Halltickets: తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన టీజీ లాసెట్ (TG LAWCET 2024), పీజీఎల్ ఎల్‌సెట్(TS PGLCET 2024) పరీక్ష హాల్‌టికెట్లను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ లాసెట్/పీజీఎల్‌సెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ, మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 3న టీఎస్‌ లాసెట్‌, టీఎస్‌ పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 10.00 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు రెండుసెషన్లలో మూడేళ్ల లాసెట్ పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు ఐదేళ్ల లాసెట్ పరీక్ష, పీజీఎల్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.


Download TS LAWCET & TS PGLCET - 2024 Halltickets


పరీక్ష విధానం..


➥ మొత్తం 120 మార్కులకు లాసెట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఇస్తారు. నెగెటివ్ మార్కుల విధానం లేదు. అభ్యర్థులు 90 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది.  


పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. అందులో పార్ట్-ఎ: జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు -30 మార్కులు, కరెంట్ అఫైర్స్ నుంచి నుంచి 30 ప్రశ్నలు -30 మార్కులు, స్టడీ ఆఫ్ లా ఆప్టిట్యూట్ నుంచి 60 ప్రశ్నలు -60 మార్కులు ఉంటాయి.


లా ఆప్టిట్యూడ్ నుంచి వచ్చే 60 ప్రశ్నల్లో 10 ప్రశ్నలు కాంప్రహెన్షన్ ఆఫ్ లీగల్ పాసేజెస్ నుంచి ఇస్తారు. ఐదేళ్ల లాకోర్సుకు ఇంటర్ స్థాయిలో, మూడేళ్ల లాకోర్సుకు డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి ప్రశ్నలు ఉంటాయి. 


పీజీలాసెట్ పరీక్షకు సంబంధించి మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఇస్తారు. నెగెటివ్ మార్కుల విధానం లేదు. అభ్యర్థులు 90 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది.


పరీక్షలో మొత్తం రెండు (పార్ట్-ఎ, పార్ట్-బి) విభాగాలు ఉంటాయి.  అందులో పార్ట్-ఎ (40 మార్కులు): జ్యురిస్‌ప్రుడెన్స్ నుంచి 20 ప్రశ్నలు - 20 మార్కులు, కాన్‌స్టిట్యూషనల్ లా 20 ప్రశ్నలు - 20 మార్కులు, పార్ట్-బి (80 మార్కులు): పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా నుంచి 16 ప్రశ్నలు -16 మార్కులు, బిజినెస్ అండ్ కార్పొరేట్ లా నుంచి 16 ప్రశ్నలు -16 మార్కులు, లేబర్ లా నుంచి 16 ప్రశ్నలు -16 మార్కులు, క్రైమ్స్ అండ్ టార్ట్స్ నుంచి 16 ప్రశ్నలు -16 మార్కులు, ఇతర లా విభాగాల నుంచి 16 ప్రశ్నలు -16 మార్కులు ఉంటాయి.  


పరీక్ష కేంద్రాలు: హైద్రాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, విజయవాడ.


అర్హత మార్కులు: 


➥ లాసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 42 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.

➥ పీజీఎల్‌సెట్‌ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 120 మార్కులకుగాను 30 మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి అర్హతమార్కులు లేవు.


లాసెట్ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..