ఉస్మానియా వర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు అందబాటులోకి వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరీక్ష హాల్‌టికెట్లను నవంబరు 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పీహెచ్‌డీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ, ప్రవేశ పరీక్ష సబ్జెక్టు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
డిసెంబరు 1 నుంచి పరీక్షలు..
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 1 నుంచి 3 వరకు పీహెచ్‌డీ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారి ఆన్‌లైన్‌లో పీహెచ్‌డీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మూడు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి సెషనల్‌లో ఉదయం 9.30 - 11.00 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 12.30 - 2.00 గంటల వరకు, మూడో సెషన్‌లో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం: ఆన్‌లైన్ విధానంలో పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 70 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రధానంగా అనలాగిస్, క్లాసిఫికేషన్, మ్యాచింగ్, కాంప్రహెన్షన్ ఆఫ్ రిసెర్చ్ స్టడీ/ ఎక్స్‌పరిమెంట్/థిరీటికల్ కోణంలో ప్రశ్నలు ఉంటాయి. ప్రవేశ పరీక్ష సిలబస్ నుంచి మాత్రమే ప్రశ్నలు అడుతుతారు. లాంగ్వేజ్ సబ్జెక్టులు మినహా మిగతా అన్ని సబ్జెక్టులకు ఇంగ్లిష్‌లోనే పరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్ష-సబ్జెక్టులు:
🔰 ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్: ఆర్కియోలజీ, ఇంగ్లిష్, లింగ్విస్టిక్స్, పర్షియన్, ఫిలాసఫీ, సంస్కృతం.
🔰 ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటెల్ లాంగ్వేజెస్: అరబిక్, తెలుగు.
🔰 ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్: ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, సోషియాలజీ.
🔰 ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్: కామర్స్.
🔰 ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్: ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్.
🔰 ఫ్యాకల్టీ ఆఫ్ లా: లా.
🔰 ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్: అప్లైడ్ కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్, జియోగ్రఫీ, జియోలజీ, జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, కంప్యూటర్ సైన్స్.
🔰 ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్: బయోమెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్.
🔰 ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ: కెమికల్ టెక్నాలజీ/కెమికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ.
🔰 ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్‌ఫర్మాటిక్స్: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ.
షెడ్యూలు ఇదే...
Also Read:
మరో గుడ్ న్యూస్, 12 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు, పోస్టుల వివరాలు ఇవే!!
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్-2,3,4 పోస్టులకు మరికొన్ని పోస్టులను చేర్చిన ప్రభుత్వం,తాజాగా గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి 9వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాష్ట్రంలోని గురుకులాల్లోనూ భారీగా పోస్టుల సంఖ్య పెరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో ప్రభుత్వం ఇప్పటికే అనుమతించిన 9,096 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు అదనంగా దాదాపు 3 వేల పోస్టులు రానున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6,511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేస్తోంది!! వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6,511 ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. వీటిలో 483 ఎస్‌ఐ పోస్టులు, 6028 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ విభాగంలో.. ఎస్‌ఐ(సివిల్)-387, ఎస్‌ఐ (ఏపీఎస్‌పీ)-96 పోస్టుల ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ ఉద్యోగాల్లో.. కానిస్టేబుల్ (సివిల్)-3508, కానిస్టేబుల్ (ఏపీఎస్‌పీ)-2520 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబరు నెలాఖరులో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
SAIL Recruitment: సెయిల్‌లో 245 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, అర్హతలివే!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2022 అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్ధులు నవంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..