హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, 2023-24 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో (ఫేజ్-1) అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పీజీ కోర్సుల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం; డిగ్రీ కోర్సుల్లో బీఏ, బీకాం, బీబీఏ ఉన్నాయి. అలాగే వివిధ విభాగాల్లో అడ్‌వాన్స్‌డ్ డిప్లొమా, అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి. కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫేజ్-1 అడ్మిషన్లు జులై 20న ప్రారంభం కానుంది.
కోర్సుల వివరాలు..
1) డిగ్రీ కోర్సులు...
➥ బీఏ
➥ బీకామ్
➥ బీబీఏ
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
2) పీజీ కోర్సులు..
➥ ఎంబీఏ
➥ ఎంసీఏ
➥ ఎంఏ
➥ ఎంకామ్
➥ ఎంఎస్సీ
అర్హత: ఏదైనా డిగ్రీ. ఎంబీ, ఎంసీఏ కోర్సులకు టీఎస్ ఐసెట్/ఏపీ ఐసెట్-2023 ఉత్తీర్ణులై ఉండాలి.
3) అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు
4) అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా కోర్సులు
అర్హత: ఏదైనా డిగ్రీ.
5) సర్టిఫికేట్(యోగా)
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు..
* ఫేజ్-1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.07.2023.
ALSO READ:
MAT: ‘మ్యాట్'-2023 సెప్టెంబరు నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష షెడ్యూలు ఇలా!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 సెప్టెంబర్ సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. తాజాగా మ్యాట్ 2023 సెప్టెంబరు నోటిఫికేషన్ విడుదలైంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
బీఆర్క్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలోని ఆర్కిటెక్చర్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్టు ఎన్‌ఏటీఏ (NATA)–2021లో (లేదా) జేఈఈ మెయిన్స్ పేపర్–2 (బీఆర్క్)–2021లో అర్హత సాధించినవారు, ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు, పదోతరగతితోపాటు డిప్లొమా పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 830 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, జులై 29 నుంచి రిజిస్ట్రేషన్!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్-2023' కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం జులై 29 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రారంభంకానుంది. ఆగస్టు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈసెట్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial