తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో విద్యారంగంలో సాధించిన విజయాలకు విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సచివాలయంలో మే 24న అధికారులతో సమీక్ష జరిపారు. జూన్‌ 20న నిర్వహించే 'తెలంగాణ విద్యా దినోత్సవం' వేడుకలను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఒకేరోజు 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు, రీడింగ్‌ కార్నర్లు, 1,600 స్మార్ట్‌ తరగతి గదులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉత్సవాలు జరిగే 21 రోజులపాటు పదేండ్లలో విద్యారంగంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అన్ని విద్యాసంస్థల్లో సభలు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని వివరించాలని సూచించారు. ‘మన ఊరు- మన బడి, మన బస్తీ -మన బడి కింద ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొదటి విడతలో రూ.3,497.62 కోట్లు వెచ్చించి, 9,123 సూళ్లను అభివృద్ధి చేసినట్టు వివరించారు. సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకురాలు శ్రీదేవసేన, అధికారులు రమేశ్‌, జయప్రదాబాయి, లక్ష్మారెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


దశాబ్ది ఉత్సవాల్లో విద్యార్థుల కోసం..


➥ రూ.190 కోట్లతో 30 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించనున్నారు.


➥ రూ.60 కోట్లతో 6 నుంచి 10వ తరగతి చదివే 12.39లక్షలమంది విద్యార్థులకు నోట్‌ పుస్తకాలను అందించనున్నారు.


➥ 2 లక్షల మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు రూ.10 కోట్ల విలువైన పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేయనున్నారు.


➥ రూ.150 కోట్లతో 26 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండేసి జతల చొప్పున యూనిఫామ్‌ అందించనున్నారు.


➥ వీటన్నింటినీ పాఠశాలల పున: ప్రారంభం నాటికి విద్యార్థులకు అందజేయనున్నారు.


Also Read:


రేపే టీఎస్ పాలిసెట్‌ ఫ‌లితాలు! రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!
తెలంగాణ పాలిసెట్ (TS POLYCET-2023) ప్రవేశ పరీక్ష ఫ‌లితాలు శుక్రవారం (మే 26న) విడుద‌ల కానున్నాయి. మే 26న ఉద‌యం 11 గంట‌ల‌కు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ సి. శ్రీనాథ్ ఫలితాలను వెల్లడించ‌నున్నారు. పరీక్ష పూర్తయిన 8 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేస్తుండటం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా మే 17న పాలీసెట్-2023 ప్రవేశ ప‌రీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 296 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వహించారు.ఈ ఏడాది పాలిసెట్ ప్రవేశ ప‌రీక్షకు మొత్తం 1,05,742 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 58,520 మంది బాలురు, 47,222 మంది బాలిక‌లు ఉన్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 98,273 మంది విద్యార్థులు పరీక్షకు హాజ‌రయ్యారు. మొత్తం 92.94 శాతం హాజరు నమోదైంది. వీరిలో 54,700 మంది బాలురు; 43,573 మంది బాలిక‌లు ఉన్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయి.
ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..