ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) 2023-24 విద్యాసంవత్సరానికిగాను వివిధ స్కాలర్‌షిష్‌ల కోసం డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌, ఎంబీఏ, పీజీ(జియాలజీ/ జియో ఫిజిక్స్‌) కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందించేందుకు ఈ పథకానికి అర్హులు. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌ అందుతుంది.  మొత్తం స్కాలర్‌షిప్‌లలో 50% మహిళా అభ్యర్థులకు కేటాయించారు. 

వివరాలు...

* ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌ పథకం 2023-24

స్కాలర్‌షిప్స్ సంఖ్య: 2000

➥ ఎస్సీ/ఎస్టీ స్కాలర్‌షిప్స్: 1000

➥ ఓబీసీ స్కాలర్‌షిప్స్: 500

➥ జనరల్/ఈడబ్ల్యూఎస్ స్కాలర్‌షిప్స్: 500

  • ఇంజనీరింగ్ – 500 (ఎస్సీ/ఎస్టీ) + 300 (ఓబీసీ) + 300 (జనరల్)
  • ఎంబీబీఎస్ - 90 (ఎస్సీ/ఎస్టీ) + 50 (ఓబీసీ) + 50 (జనరల్)
  • ఎంబీఏ – 140 (ఎస్సీ/ఎస్టీ) + 50 (ఓబీసీ) + 50 (జనరల్)
  • జియాలజీ/జియోఫిజిక్స్‌లో మాస్టర్స్ – 270 (ఎస్సీ/ఎస్టీ) + 100 (ఓబీసీ) + 100 (జనరల్)

జోన్లవారీగా స్కాలర్‌షిప్ కేటాయింపులు...

  • నార్త్ జోన్ – 200 (ఎస్సీ/ఎస్టీ) + 100 (ఓబీసీ) + 100 (జనరల్)
  • వెస్ట్ జోన్ - 200 (ఎస్సీ/ఎస్టీ) + 100 (ఓబీసీ) + 100 (జనరల్)
  • నార్త్-ఈస్ట్ జోన్ – 200 (ఎస్సీ/ఎస్టీ) + 100 (ఓబీసీ) + 100 (జనరల్)
  • ఈస్ట్ జోన్ – 200 (ఎస్సీ/ఎస్టీ) + 100 (ఓబీసీ) + 100 (జనరల్)
  • సౌత్ జోన్ - 200 (ఎస్సీ/ఎస్టీ) + 100 (ఓబీసీ) + 100 (జనరల్)
నార్త్ జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్
వెస్ట్ జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా, మధ్యప్రదేశ్, దాదర్ & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ
నార్త్-ఈస్ట్ జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు అస్సాం, మిజోరాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్
ఈస్ట్ జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్
సౌత్ జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్

అర్హతలు..

➥ ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్‌ డిగ్రీ లేదా పీజీ కోర్సు రెగ్యులర్‌ విధానంలో చదువుతూ ఉండాలి.

➥ 60 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్‌ (బీఈ/ బీటెక్‌), ఎంబీబీఎస్‌ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్‌/ ఎంబీఏ.. వీటిలో ఏ కోర్సునైనా అభ్యసిస్తున్న ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 

➥ అదేవిధంగా ఎంఎస్సీ(జియాలజీ/ జియోఫిజిక్స్‌) లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులు డిగ్రీలో 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. 

➥ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు. 

వయోపరిమితి: 16.10.2023 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

స్కాలర్‌షిప్ మొత్తం: ప్రతీ సంవత్సరం రూ.48,000 చెల్లిస్తారు.

దరఖాస్తు చివరితేది: 30.11.2023.

Notification & Online Applicatiion

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...