Nursing Training in Germany: తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్ (TOMCOM), రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో జర్మనీలో నర్సింగ్‌ శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ఉన్నవారు నర్సింగ్ శిక్షణకు అర్హులు. శిక్షణ సమయంలో నెలకు రూ.లక్ష స్కాలర్‌షిప్ అందిస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నర్సింగ్‌లో అంతర్జాతీయ డిగ్రీ కోసం మూడేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు జర్మనీకి వెళ్లే ముందు హైదరాబాద్‌లో జర్మనీ భాషపై 6 నెలల రెసిడెన్షియల్‌ శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం నెలకు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఉద్యోగ హామీ ఉంటుంది. మరిన్ని వివరాలకు 63022 92450, 79012 90580 నెంబర్లలో సంప్రదించాల్సి ఉంటుంది.


వివరాలు..


* జర్మనీలో నర్సింగ్ శిక్షణ


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.


వయోపరిమితి: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 


శిక్షణ వివరాలు..


➨ ఎంపికైన అభ్యర్థులకు జర్మనీకి వెళ్లే ముందు హైదరాబాద్‌లో జర్మనీ భాషపై ఆరు నెలల రెసిడెన్షియల్‌ శిక్షణ ఉంటుంది.


➨ శిక్షణ అనంతరం నెలకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వేతనంతో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. 


సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 63022 92450, 79012 90580 నెంబర్లలో సంప్రదించవచ్చు.


Website


ఎంబీబీఎస్‌ విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు మరో ఛాన్స్..
దేశంలోని వైద్యకళాశాల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు పొంది, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) శుభవార్త తెలిపింది. 2020-21 ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు పరీక్ష రాసేందుకు మరో ప్రయత్నానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డిసెంబరు 11న ఎన్‌ఎంసీ ఒక ప్రకటన విడుదల చేసింది. 2020-21 విద్యాసంవత్సరంలో వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొంది తమ మొదటి ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులను మాత్రమే మరో ప్రయత్నం (5వ సారి పరీక్ష)కు అనుమతిస్తున్నట్లు స్పష్టంచేసింది. ఈ బ్యాచ్‌పై కొవిడ్ ప్రభావం పడినందున వారికి మాత్రమే అదనపు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఇదే చివరి అవకాశమని, ఇకపై ఇలాంటి అవకాశం ఉండబోదని ఎన్ఎంసీ తేల్చి చెప్పింది.


ALSO READ:


గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే
దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE)-2024 పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌-బెంగళూరు(IISc) డిసెంబరు 5న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశ వ్యాప్తంగా 200 నగరాల్లో రెండు షిఫ్టుల్లో 'గేట్' పరీక్ష నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ పరీక్ష నిర్వహిస్తారనే షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష షెడ్యూలులో మారే అవకాశం ఉంది. 
గేట్-2024 పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...