కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఎన్టీఆర్‌ ఉన్నత పాఠశాలలో 6,7,8,9లో ఒక్కో తరగతిలో 10 మంది చొప్పున మొత్తం 40 మంది విద్యార్థులకు (డే స్కాలర్స్‌)కి ఉచిత విద్య అందించనున్నట్లు ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి శనివారం(జూన్‌ 3) ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు జూన్ 9న సాయంత్రం 4గంటలోపు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలిసి, వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రవేశాల కంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. జూన్ 11న పాఠశాలలో ప్రతిభా పరీక్ష నిర్వహించి, విద్యార్థులను ఎంపిక చేస్తామని ఆమె తెలిపారు. అనాథ, నిరుపేద బాలబాలికలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా 2005 నుంచి ఉచిత విద్య అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 


వెబ్‌సైట్


Also Read:


ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ప్రవేశాలు కోరేవారు జూన్‌ 4 నుంచి జూన్ 26న సాయంత్రం 5 గంటల్లోపు వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్ధులకు సీటు కేటాయింపు ఉంటుంది. ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు యేటా మూడు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! 
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జూన్ 1న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 17 నుంచి 22 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు ఇప్పటివరకు కంపార్ట్‌మెంట్ పరీక్ష అనే పేరును 'సప్లిమెంటరీ'గా మార్చారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు కూడా బోర్డు అవకాశం కల్పించింది. పదోతరగతి విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు రెండు సబ్జెక్టులను సప్లిమెంటరీలో భాగంగా రాసుకొనేందుకు వెసులు బాటు కల్పించిన బీసీసీఐ అధికారులు.. 12వ తరగతి విద్యార్థులకు ఒక సబ్జెక్టులో మాత్రమే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జులై 17న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 12వ తరగతి సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు.  
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 


తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-23 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు మే 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా తదితర అంశాలకు సంబంధించి.. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..