ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉపకారవేతనం అందించనున్నట్లు ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి తెలిపారు. దీనికి ఈ ఏడాది డిసెంబరు 4న 'గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (జీఈఎస్‌టీ -2023)' పేరుతో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదోతరగతి చదివే బాలికలు ఈ పరీక్ష రాయడానికి అర్హులని.. మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు సాధించినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఇంటర్ పూర్తయ్యేవరకూ ఉపకారవేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా నవంబరు 11 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 76600 02627/28 నంబర్లను సంప్రదించాలని ఆమె సూచించారు.
వివరాలు..
* గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ టెస్ట్ (GEST)
అర్హత: 2023 మార్చి/ఏప్రిల్ పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్స్, జీకే, రీజినింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పదోతరగతి స్థాయిలోనే పరీక్ష ఉంటుంది.
పరీక్షకు హాజరయ్యేవారు తీసుకురావాల్సినవి: రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, బ్లాక్ పాయింట్ పెన్, రైటింగ్ ప్యాడ్, ఫొటో ఐడీకార్డు లేదా స్కూల్ ఐడీ కార్డు, మాస్కులు, శానిటైజర్.
ముఖ్యమైన తేదీలు..
⫸ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.11.2022
⫸ దరఖాస్తుకు చివరితేది: 30.11.2022.
⫸ పరీక్ష తేది, సమయం: 04.12.2022 (ఆదివారం), ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
వేదిక: NTR Junior & Degree College for Women.
Chilukur Balaji Temple Road, Himayath Nagar Village,
Moinabad Mandal, R.R. Dist., Telangana 500075.
:: Also Read ::
విద్యార్థులకు గుడ్ న్యూస్, పీజీ లేకున్నా 'పీహెచ్‌డీ'లో చేరొచ్చు - ఎలాగంటే?
మీరు బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, డిగ్రీ (నాలుగేళ్లు) లాంటి కోర్సులు చేశారా.? వీటి తర్వాత పీజీ కాకుండా డైరెక్ట్‌గా పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారా.? మరి అదెలాగని ఆలోచిస్తున్నారా.. అయితే టెన్షన్ పడకండి.. విద్యార్ధులకు ఓ గుడ్ న్యూస్. యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పీహెచ్‌డీ కోర్సుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదవకున్నా.. పీహెచ్‌డీ చేసే అవకాశం పొందొచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
NEET PG: నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది! మరి 'నెక్ట్స్' ఏంటంటే?
వైద్యవిద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-పీజీ పరీక్షకు కేంద్రప్రభుత్వం రద్దుచేయనుంది. ఇప్పటికే ప్రకటించిన నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది అని అధికారులు తెలిపారు. నీట్-పీజీ స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT-నెక్ట్స్) నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2020లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) చట్టానికి సవరణలు చేసిన కేంద్రప్రభుత్వం, నీట్-పీజీ స్థానంలో నెక్ట్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మొదటి నెక్ట్స్ 2023 డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. 2019-20 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులు 'NExT' రాసే మొదటి బ్యాచ్ కానున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..