UGC Net Exam schedule: యూజీసీ నెట్ (UGC NET) జూన్ 2026 ఎగ్జామ్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్ష 2026 జూన్ 22న ప్రారంభం కాగా జూన్ 30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test) ద్వారా నిర్వహించనున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఈ షెడ్యూల్‌లో 5 రోజులలో రెండు షిఫ్టులలో 80కి పైగా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. NTA ప్రకారం, పరీక్షలు ప్రతిరోజూ 2 షిఫ్టులలో జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించనున్నారు.

Continues below advertisement

జూన్ 12 నుండి 14 జూన్ వరకు సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు 

యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన సిటీ ఎగ్జామ్ సెంటర్ వివరాలు ఎగ్జామ్‌కు దాదాపు 8 నుండి 10 రోజుల ముందు NTA తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. దీని ప్రకారం, జూన్ 22న పరీక్ష రాసే అభ్యర్థులు జూన్ 12 నుండి 14 వరకు సిటీ కేటాయింపు వివరాలను పొందవచ్చని అధికారులు సూచించారు. నెట్ అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు విడుదలైన వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఎగ్జామ్ సెంటర్ ఉన్న సిటీ, షిఫ్ట్ సమయం, సబ్జెక్ట్ కోడ్‌తో సహా అన్ని వివరాలను తమ  ఎగ్జామ్ డేట్‌కు చాలా ముందుగానే ధృవీకరించుకోవాలని NTA సూచించింది.

Continues below advertisement

Also Read: AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే

UGC NET 2026 ఎగ్జామ్ షెడ్యూల్

UGC NET పరీక్ష జూన్ 22వ తేదీన ప్రారంభమవుతుంది. మొదటి దశలో మరాఠీ, పంజాబీ, తమిళం, విజువల్ ఆర్ట్స్, మ్యూజియాలజీ అండ్ కన్జర్వేషన్, జాగ్రఫీ, లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ వంటి సబ్జెక్టులు ఉంటాయి.  రెండవ దశలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, రష్యన్, బెంగాలీ, పర్షియన్, హోమ్ సైన్స్, మ్యూజిక్ అండ్ పాపులేషన్ స్టడీస్ వంటి సబ్జెక్టులు ఉంటాయి.

జూన్ 30 వరకు నెట్ పరీక్షలు 

NTA తెలిపిన వివరాల ప్రకారం, UGC NET పరీక్షలు జూన్ 30 వరకు జరుగుతాయి. జూన్ 30న మొదటి దశలో ఎకనామిక్స్,  సంబంధిత సబ్జెక్టులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, హిందూ స్టడీస్, ఆంత్రోపాలజీ, పొలిటిక్స్, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, బోడో, గుజరాతీ, సంస్కృతం ఉంటాయి. రెండవ దశలో అస్సామీ, సోషియాలజీ, యోగా, టూరిజం, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్, అడల్ట్ ఎడ్యుకేషన్, ఆర్కియాలజీ, సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్, స్టాటిస్టిక్స్, ఫారెస్ట్రీ, ఒడియా ఉంటాయి.

Also Read: TS EAPCET 2026 Results : తెలంగాణ ఎప్‌సెట్ 2026 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

వెబ్‌సైట్‌ను చెక్ చేస్తుండాలని అభ్యర్థులకు సూచన 

యూజీసీ నెట్ 2026 పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేయడంతో పాటు, అప్‌డేట్‌లు, సూచనలు, సమాచారం కోసం అధికారిక UGC NET పోర్టల్ ugcnet.nta.nic.in/ ని క్రమం తప్పకుండా సందర్శిస్తుండాలని అభ్యర్థులకు NTA సలహా ఇచ్చింది. ఏవైనా సందేహాలు ఉంటే NTAని 011- 40759000 నంబర్‌లో సంప్రదించవచ్చు. లేదా ugcnet@nta.ac.inకు ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.