న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 పరీక్ష నేటి మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ఇటీవల నిర్వహించిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), కేంద్ర ప్రభుత్వం నీట్ యూజీ మళ్లీ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈసారి ఎగ్జామ్ నిర్వహణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షా ఏజెన్సీ ఎన్టీఏ అభ్యర్థులకు కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

Continues below advertisement

దేశంలోనే అతిపెద్ద మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-UG 2026 రీ-ఎగ్జామ్ ఆదివారం, జూన్ 21న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నీట్ యూజీ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు జరుగుతుంది. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 551 నగరాల్లో,  విదేశాల్లోని 14 నగరాల్లో సుమారు 22.79 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. మే నెలలో నిర్వహించిన పరీక్షపై తలెత్తిన వివాదాల తర్వాత, ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) భద్రత కోసం చాలా కఠినమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల్లో CCTV నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పోలీసు భద్రతతో పాటు పటిష్ట చర్యలు తీసుకుంది. 

నీట్ యూజీ అభ్యర్థులకు కీలక సూచనలు 

 నీట్ యూజీ అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం 1:30 గంటల వరకే అభ్యర్థుల్ని ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ఏ అభ్యర్థికీ పరీక్షాం కేంద్రంలోకి ప్రవేశం ఉండదని NTA స్పష్టం చేసింది.  చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా నిర్ణీత సమయానికి ముందే సెంటర్‌కు చేరుకోండి.

Continues below advertisement

పరీక్షా కేంద్రానికి ఏమేం తీసుకువెళ్లాలి?

  • మీ అడ్మిట్ కార్డు ప్రింట్ కాపీ
  • ఒక వ్యాలిడ్ ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, ఓటర్ ఐడి లాంటివి)
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • ట్రాన్సపరెంట్ వాటర్ బాటిల్ 
  • డయాబెటిస్‌తో బాధపడుతున్న అభ్యర్థులు నిబంధనల ప్రకారం షుగర్ టాబ్లెట్లు, పండ్లు (అరటిపండు, ఆపిల్, నారింజ మొదలైనవి) తమ వెంట తీసుకువెళ్లవచ్చు.

ఎలాంటి దుస్తులు ధరించి వెళ్లాలి?

  •   సాధారణ, తేలికపాటి దుస్తులు ధరించాలని అభ్యర్థులకు NTA సూచించింది.
  • హాఫ్ హ్యాండ్స్ దుస్తులు ధరించడం మంచిది.
  • భారీ ఎంబ్రాయిడరీ, పెద్ద బటన్లు లేదా ఎక్కువ జేబులు ఉన్న దుస్తులు ధరించకపోవడం బెటర్ .
  • సాధారణ చెప్పులు లేదా శాండల్స్ ధరించాలి
  • మెటల్ యాక్సెసరీస్ లాంటివి అసలు ధరించవద్దు.
  • మతపరమైన లేదా సాంప్రదాయ దుస్తులు ధరించే అభ్యర్థులు అదనపు తనిఖీ కోసం కొద్దిగా ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలి.

సెంటర్ లోపల ఏం జరుగుతుంది?

ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించే ముందు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ తర్వాత ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ జరుగుతుంది. సాంకేతిక కారణాలు, సరిగ్గాలేని వేలిముద్రలు లేదా UIDAI కనెక్టివిటీ సమస్యల కారణంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ జరగకపోతే, అభ్యర్థిని పరీక్ష రాయకుండా ఆపబోమని NTA తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో పత్రాల ఆధారంగా మాన్యువల్ వెరిఫికేషన్ చేయనున్నారు. 

నిఘా ఎలా ఉంటుంది?

  • ఈసారి పరీక్షకు నిఘా రెండు, మూడు లెవెల్స్‌లో ఉంటుంది.
  • దేశవ్యాప్తంగా 674 సిటీ కోఆర్డినేటర్లు, 6,669 అబ్జర్వర్‌లను నియమించారు.
  • అన్ని పరీక్షా కేంద్రాలు CCTV కెమెరాల నిఘాలో ఉంటాయి.
  • కంట్రోల్ రూమ్ నుండి లైవ్ మానిటరింగ్ జరుగుతుంది.
  • ప్రశ్నపత్రాలు, గోప్యమైన సామగ్రి సీల్డ్ భద్రతా వ్యవస్థలో పంపబడతాయి.
  • సామగ్రిని తీసుకువెళ్లే వాహనాలకు GPS ట్రాకింగ్ మరియు పోలీసు ఎస్కార్ట్ ఉంటుంది.
  • సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక నిఘా ఉంచబడింది.

వదంతుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

ప్రశ్నపత్రాల లీక్ లేదా పరీక్షలో అక్రమాలకు సంబంధించిన వదంతులను నమ్మవద్దనిఅభ్యర్థులకు NTA సూచించింది. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి అధికారులకు తెలియజేయాలని సూచించింది.