Hero Xtreme 250R vs KTM 250 Duke: 250cc స్పోర్టీ మోటార్‌ సైకిల్ సెగ్మెంట్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన పోటీ Hero Xtreme 250R & KTM 250 Duke మధ్య కొనసాగుతోంది. Hero MotoCorp తన కొత్త Xtreme 250R ను ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత వేగవంతమైన బైక్ అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఈ రెండు బైక్‌ల పనితీరును VBox టెస్టింగ్ ద్వారా పరీక్షించి పోల్చారు. యాక్సిలరేషన్, రోల్-ఆన్ యాక్సిలరేషన్, బ్రేకింగ్ విభాగాల్లో ఏ బైక్ పైచేయి సాధించిందో చూద్దాం.

Continues below advertisement

స్టార్ట్ నుంచే దూసుకెళ్లిన Hero Xtreme 250R

స్టాండింగ్ స్టార్ట్ యాక్సిలరేషన్ పరీక్షలో KTM 250 Duke కంటే Hero Xtreme 250R మెరుగైన ఫలితాలను రికార్డ్‌ చేసింది.

Continues below advertisement
వేగం
Hero Xtreme 250R
KTM 250 Duke
0-60kph
 
3.15s
3.44s
0-80kph
 
5.2s
5.50s
0-100kph
 
8.22s
8.50s

టెస్ట్ ప్రారంభమైన క్షణం నుంచే Xtreme 250R ఆధిక్యం కనబరిచింది. ప్రతి దశలోనూ దాదాపు 0.3 సెకన్ల తేడాతో KTM 250 Dukeను వెనక్కి నెట్టింది. ఇప్పటివరకు క్వార్టర్ లీటర్ స్పోర్టీ బైక్ సెగ్మెంట్‌లో KTM 250 Duke ఆధిపత్యం కొనసాగించింది. అయితే Hero Xtreme 250Rలో ఉన్న బలమైన లో-ఎండ్, మిడ్-రేంజ్ టార్క్ కారణంగా అది ఇప్పుడు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తోంది.

రోల్-ఆన్ యాక్సిలరేషన్‌లో కూడా హీరోదే హవా

రోజువారీ రైడింగ్‌లో రోల్-ఆన్ యాక్సిలరేషన్ ఎంతో కీలకం. ఈ విభాగంలో కూడా Hero Xtreme 250R స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

పరీక్ష
Hero Xtreme 250R
KTM 250 Duke
20-50kph (2nd gear)
 
2.33s
2.62s
30-70kph (3rd gear)
 
4.20s
4.68s
50-80kph (4th gear)
 
4.41s
5.16s

ఈ ఫలితాలు చూస్తే ట్రాఫిక్‌లో ఓవర్‌టేకింగ్, వేగంగా స్పీడ్ పెంచుకోవడం వంటి వాస్తవ పరిస్థితుల్లో Hero Xtreme 250R మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని స్పష్టమవుతోంది.

స్పెసిఫికేషన్లు ఒకలా... ఫలితాలు మరోలా!

కాగితాలపై చూస్తే KTM 250 Dukeకు స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు కనిపిస్తుంది.

* KTM 250 Duke పవర్: 31 HP* బరువు: 162.8 కేజీలు

మరోవైపు,

* Hero Xtreme 250R పవర్: 30 HP* బరువు: 167.7 కేజీలు

అంటే KTM ఎక్కువ పవర్ ఉత్పత్తి చేస్తూ తక్కువ బరువుతో ఉంది. అయినప్పటికీ రియల్ వరల్డ్ పనితీరు పరీక్షల్లో Hero బండే మెరుగైన ఫలితాలు సాధించింది. దీనికి ప్రధాన కారణం Xtreme 250Rలోని బలమైన లో-ఎండ్ టార్క్. KTM ఇంజిన్ తన అసలు శక్తిని 7,000 rpm తర్వాత మాత్రమే ప్రదర్శిస్తే, Hero ఇంజిన్‌ టెస్ట్‌ ప్రారంభం నుంచే దూకుడు చూపించింది.

బ్రేకింగ్‌లో KTM బెటర్‌

యాక్సిలరేషన్‌లో వెనుకబడిన KTM 250 Duke, బ్రేకింగ్ పరీక్షలో మాత్రం తన బలాన్ని చూపించింది.

బ్రేకింగ్ పరీక్ష
Hero Xtreme 250R
KTM 250 Duke

60-0kph

(in metres)

 
17.54m
17.32m

KTM 250 Duke తక్కువ దూరంలోనే పూర్తిగా ఆగగలిగింది.

దీనికి ప్రధాన కారణం KTMలో ఉపయోగించిన అధునాతన బ్రేకింగ్ వ్యవస్థ. ఇందులో 320 మిల్లీమీటర్ల పెద్ద డిస్క్‌తో పాటు 4-పిస్టన్ రేడియల్ మౌంటెడ్ బ్రేక్ కాలిపర్స్ ఉన్నాయి. ఇవి భారతీయంగా తయారయ్యే బైక్‌లలో అత్యుత్తమ బ్రేకింగ్ సెటప్‌లలో ఒకటిగా గుర్తింపు పొందాయి.

అంతేకాకుండా బ్రేక్ లివర్ ద్వారా రైడర్‌కు అందే ఫీడ్‌బ్యాక్ కూడా KTMలో మరింత మెరుగ్గా ఉంటుంది.

తుది మాట

Hero MotoCorp చేసిన "సెగ్మెంట్‌లోనే వేగవంతమైన బైక్" అనే ప్రకటనకు ఈ పరీక్షలు బలమైన ఆధారంగా నిలిచాయి. స్టాండింగ్ యాక్సిలరేషన్, రోల్-ఆన్ యాక్సిలరేషన్ రెండింటిలోనూ KTM 250 Duke కంటే Hero Xtreme 250R మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. అయితే బ్రేకింగ్ పనితీరు, బ్రేక్ ఫీల్ విషయంలో KTM 250 Duke ఇంకా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

మొత్తం మీద, వేగవంతమైన యాక్సిలరేషన్, నగర రైడింగ్‌లో బలమైన స్పందన కోరుకునేవారికి Hero Xtreme 250R మంచి ఎంపిక. అధిక వేగాల్లో స్థిరత్వం, మెరుగైన బ్రేకింగ్ ఫీల్ కోరుకునే రైడర్లకు KTM 250 Duke ఇంకా ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.