యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2022 (యూజీసీ - నెట్‌) ఫలితాలను జాతీయ పరీక్షల మండలి ఫలితాలను ఏప్రిల్‌ 13న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.  జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి, మార్చిలో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. సీబీటీ విధానంలో మొత్తం 83 సబ్జెక్టుల్లో పరీక్ష జరిగింది. యూజీసీ ఆధ్వర్యంలో ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2022 (యూజీసీ- నెట్‌) ప్రిలిమినరీ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి 23న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఏప్రిల్‌ 6న ఫైనల్ కీని విడుదల చేసింది.


యూజీసీనెట్ పరీక్షను దేశవ్యాప్తంగా 663 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 83 సబ్జెక్టుల్లో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 16 వరకు నిర్వహించారు. మొత్తం 8,34,537 అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. తుది ఆన్సర్ కీ వెలువడిన నేపథ్యంలో త్వరలోనే ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. 


దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంటుంది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబరు) యూజీసీ నెట్ పరీక్షలకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటారు.


Also Read


ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని 194 ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 16న ప్రవేశ పరీక్ష జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆరో తరగతిలో ప్రవేశానికి  ఏప్రిల్ 16న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7-10 తరగతుల్లో ప్రవేశానికి అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ పరీక్షల కోసం జనవరి 10 నుంచి మార్చి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70,041 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు తమ రిఫరెన్స్‌ ఐడీ/ పేరు/ మొబైల్‌ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ప్రవేశపరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


జాతీయ స్థాయిలో ఒకే తరహా క్రెడిట్స్‌ విధానం: యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌కుమార్‌
జాతీయస్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేంవర్‌ రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చైర్మన్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. జాతీయ విద్యావిధానం-2020కి అనుగుణంగా పాఠశాల విద్య నుంచే క్రెడిట్స్‌ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇదే కోవలో తాము నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేంవర్క్‌ను విడుదల చేశామని తెలిపారు. నేషనల్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేంవర్క్‌, నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేంవర్క్‌, నేషనల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేంవర్క్‌లను ఏకీకృతం చేశామని వివరించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..