NEET UG 2024 Answer Key 2024: దేశంలోని వైద్యకళాశాలల్లో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష 'నీట్ యూజీ - 2024' ప్రాథమిక ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 29న విడుదల చేసింది. ఆన్సర్ 'కీ'ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల ఆన్సర్ షీట్లను (రెస్పాన్స్ షీట్) కూడా NTA విడుదల చేసింది. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు మే 31న రాత్రి 11.50 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. 


అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలి. నిర్ణీత గడువులోగా నమోదుచేసిన అభ్యంతరాలనే అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ అభ్యంతరాలపై నిపుణుల పరిశీలన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని ఎన్టీఏ విడుదల చేయనుంది. ఆ తర్వాత ఫలితాలను ప్రకటించనుంది. 


 NEET UG 2024 అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..


NEET UG 2024 ఆన్సర్ 'కీ' సంబంధిత వివరాల కోసం క్లిక్ చేయండి..


దేశవ్యాప్తంగా 557 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో మే 5న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పెన్ను, పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షల నిర్వహించారు. తెలుగుతో పాటు 13 బాషల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. 


ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరైన సంగతి తెలిసిందే. మొత్తం 23.30 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. నీట్ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా మొత్తం 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 10 లక్షలకు పైగా బాలురు, 13 లక్షలకుపైగా బాలికలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1.5 లక్షల మంది (ఏపీ 70 వేలు, తెలంగాణ 80 వేలు) విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఏపీలో 29 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు.


నీట్ యూజీ పరీక్షలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రియల్ టైం అనలిటికల్ టూల్‌ను వినియోగించారు. ఇది విద్యార్థులు ఏవైనా తప్పిదాలకు పాల్పడితే వెంటనే గుర్తిస్తుంది. నీట్ యూజీలో (NEET UG) అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 706 వైద్య కళాశాలల్లో (Medical Admissions) ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ఈ కళాశాలల్లో లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.


నీట్ యూజీ  2024 పరీక్ష విధానం..


➥ నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షను పూర్తిగా ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. పరీక్ష సమయం మూడు గంటల 20 నిముషాలు. పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.


➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.


➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు ఉంటాయి. వాటిలో ఏదైనా ఒక సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇస్తారు.


➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.


Information Broucher


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..