దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ శనివారం (ఏప్రిల్ 29) ఉదయం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. వెబ్‌సైట్ నుంచి స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మలై కేడియా టాపర్‌గా నిలిచాడు. 


జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 8.24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక సెషన్-2 పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 15 వరకు నిర్వహించగా 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే, ఈ రెండు విడతల పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు (రెండు సార్లు రాసి ఉంటే)ను పరిగణనలోకి తీసుకొని ఎన్‌టీఏ ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి ఎంపికచేస్తారు.


జేఈఈ మెయిన్ (సెషన్-2) ఫలితాల కోసం క్లిక్ చేయండి..


కటాఫ్ మార్కులు ఇలా..



ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తులు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థుల నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే మే 8 వరకు దరఖాస్తు ఫీజు  చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 నుంచి 12 వరకు పేపర్-1 పరీక్ష; మధ్యాహ్నం 2.30 నుంంచి సాయంత్రం 5.30 వరకు  పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ప్రాథమిక సమాధానాల కీ జూన్ 11న; ఫలితాలు జూన్ 18న విడుదల చేయనున్నారు. 


Also Read:


ఏపీ ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈసారి ఎన్ని సెలవులంటే?
ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి‌ 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, అలాగే వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అదేవిధంగా మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
ఇంటర్ పూర్తి క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..


ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్‌ 1 వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలును ఇంటర్‌బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్‌ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..