దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలను నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఫిబ్రవరి 2న ఆన్సర్ కీని విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలతో పాటు ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.


ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు ఫిబ్రవరి 4న రాత్రి 7.50గంటల వరకు అవకాశం కల్పించింది. విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలోనే తమ అభ్యంతరాలను తెలపవచ్చని పేర్కొంది. అభ్యంతరాలపై ప్రతి ప్రశ్నకు రూ.200లు చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోపు విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను ఆయా సబ్జెక్టుల్లో నిపుణులు పరిశీలిస్తారు. ఒకవేళ అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవే అయితే.. ఆన్సర్ కీని సవరించి తుది కీ విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.


Answer Key with Question Papers
JEE Main Session-1 (2023) – Answer Key Challenge


                                               


Also Read:


తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ-కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ సైనిక పాఠశాలను ప్రత్యేకంగా బాలుర కోసం ఏర్పాటుచేశారు. సరైన అర్హతలు గల బాలురు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపికలు ఉంటాయి.
ప్రవేశ ప్రకటన, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!


తెలంగాణ 'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తులు ప్రారంభం!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 10న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరు విద్యార్థులు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...