CSIR UGC NET July 2024 Results: దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్(జేఆర్‌ఎఫ్), లెక్చరర్‌షిప్(ఎల్‌ఎస్)/ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం నిర్వహించిన జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (CSIR-UGC-NET) జులై-2024 ఫలితాలు సెప్టెంబరు 12న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా, జులై 25 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా 187 నగరాల్లో మొత్తం 348 కేంద్రాల్లో జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 2,25,335 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,63,529 మంది హాజరయ్యారు.
➥ జులై 25న నిర్వహించిన ఎర్త్ సైన్సెస్ పరీక్షకు 8,127 మంది దరఖాస్తు చేసుకోగా 5,171 మంది; ఫిజికల్ సైన్సెస్ పరీక్షకు 35,721 మంది దరఖాస్తు చేసుకోగా 25,075 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇక మ్యాథమెటికల్ సైన్సెస్ పరీక్షకు 40,795 మంది దరఖాస్తు చేసుకోగా 29,118 మంది హాజరయ్యారు
➥ జులై 26న నిర్వహించిన లైఫ్ సైన్సెస్ పరీక్షకు 90,683 మంది దరఖాస్తు చేసుకోగా.. 67,850 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
➥ జులై 27న నిర్వహించిన కెమికల్ సైన్సెస్ పరీక్షకు 50,009 మంది దరఖాస్తు చేసుకోగా 36,315 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
CSIR-UGC-NET July 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ ఫలితాల కోసం అభ్యర్థుల మొదట అధికారిక వెబ్‌సైట్ https://csirnet.nta.ac.in సందర్శించాలి.
➥ అక్కడ హోమ్‌పేజీలో కనిపించే ‘Joint CSIR-UGC NET JULY-2024: Score Card (Click Here)’ లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.
➥ అభ్యర్థుల CSIR-UGC NET ఫలితాలు కంప్యూటర్ స్కీన్ మీద కనిపిస్తాయి.
➥ అనంతరం స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకొని భవి భద్రపర్చుకోవాలి.
CSIR-UGC-NET 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం ఎన్‌టీఏ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌కు అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లు, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే అవకాశం లభిస్తుంది.
పరీక్ష విధానం..
➥ మొత్తం 5 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్/ అట్మాస్ఫియరిక్/ ఓషియన్/ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.
➥ పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి. 'పార్ట్-ఎ' విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 'పార్ట్-బి', 'పార్ట్-సి' విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.
➥ ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.