దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పించే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) దరఖాస్తు గడువును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పొడిగించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఏప్రిల్‌ 19తో ముగియాల్సిన గడువును మే 5 వరకు పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా వెంటనే తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మే 6, 7, 8 తేదీల్లో అవకాశం కల్పించింది. పరీక్ష తేదీలు, అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌, ఫలితాల ప్రకటన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది.


దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ-2023)‌ నోటిఫికేషన్ మార్చి 20న  వెలువడిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. పరీక్ష షెడ్యూలును త్వరలోనే వెల్లడించనున్నారు. సీయూటీ పీజీ ప్రవేశ పరీక్షను  జూన్ 1 నుండి జూన్ 10 వరకు నిర్వహించనున్నట్లు గతంలో UGC ఛైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసందే. దీని ఫలితాలు జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే పరీక్ష తేదీపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.



ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా దాదాపు 344 పీజీ కోర్సులతో పాటుగా 271 రీసెర్చ్ ప్రోగ్రాంలలో ప్రవేశం పొందొచ్చు. సీయూఈటీ పీజీ పరీక్షను ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియంతో పాటుగా అన్ని రాష్ట్రాల స్థానిక భాషల్లో నిర్వహిస్తున్నారు. సీయూఈటీ పీజీ-2023 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు 42 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, హైదరాబాాద్ సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్‌ యూనివర్సిటీల్లోనూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మార్కులు ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా 66 కేంద్రీయ, రాష్ట్రీయ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం గతేడాది ఎన్‌టీఏ నిర్వహించిన పరీక్షకు దాదాపు 6.07 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం తెలిసిందే.


అర్హత, వయసు: అభ్యర్థులు 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు చేసేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు. విదేశీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


దరఖాస్తు ఫీజు: 



పరీక్ష విధానం: 


సీయూఈటీ పీజీ పరీక్షను 2 గంటల నిడివితో సీబీటీ ఆధారంగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 100 ప్రశ్నలతో రెండు భాగాలుగా ఇవ్వబడుతుంది. ఇందులో పార్ట్ A లో 25 ప్రశ్నలు, పార్ట్ B లో 75 ప్రశ్నలు లెక్కన ఇవ్వబడతాయి. ప్రశ్నలు మరియు సిలబస్ అభ్యర్థి ఎంపిక చేసుకున్న పేపర్ కోడ్ ఆధారంగా మారుతుంటాయి. సీయూఈటీ పీజీ పరీక్షను రోజుకు రెండు సెషన్ల చెప్పున ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులను అనుచరించి ఆయా సెషన్లలో హాజరుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ గ్రాడ్యుయేట్ సిలబస్ ఆధారితంగా ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు తొలగిస్తారు. స్థానిక భాషలో పరీక్షను రాయాలనుకునే అభ్యర్థులు సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ సెంటర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.


సీయూఈటీ నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..