UGC NET December 2024 Schedule: దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న యూజీసీ నెట్ (డిసెంబరు)-2024 పరీక్ష తేదీలను సబ్జెక్టుల వారీగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డిసెంబరు 20న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో జనవరి 3 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో నెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో; మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 85 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.


యూజీసీ నెట్ (డిసెంబరు)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ నవంబరు 19 నుంచి డిసెంబర్‌ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఫోన్ నెంబరు: 011 - 40759000 లేదా ఈమెయిల్: ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన అభ్యర్థులు పీహెచ్‌డీలో ప్రవేశాలు పొందవచ్చు. లెక్చరర్‌షిప్ అర్హత సాధించినవారు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధిస్తారు. 


పరీక్ష విధానం..


➥ మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.


➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.


➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.


అర్హత మార్కులు.. 
అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ వారు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ వారు కనీసం 35 శాతం మార్కులను స్కోర్ చేయాలి.


తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 


ఏపీలో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.



Notification


Website


ALSO READ:


సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
ఈ ఏడాదికి గాను రెండో విడత 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబరు 9న ప్రారంభమైంది. డిసెంబరు 30 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...