TSEMR 6th class Admissions: తెలంగాణ రాష్ట్రంలోని  23 ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.  బోధనా మాధ్యమం ఇంగ్లీషులో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ ట్రైబ్ తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు మార్చి 22లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్‌ 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు.


పరీక్ష వివరాలు..


* తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు


* ఈఎంఆర్ఎస్ సెలెక్షన్ టెస్ట్(ఈఎంఆర్ఎస్ఎస్‌టీ)- 2024


సీట్ల సంఖ్య: ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 23 విద్యాలయాల్లో 1,380(690 బాలురు, 690 బాలికలు) సీట్లు కెటాయించారు. 

అర్హతలు: ఆరో తరతగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొనే  విద్యార్థులు తప్పనిసరిగా 2023-24 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి.  విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.


వయోపరిమితి: 31.03.2024 నాటికి 6వ తరగతికి 10-13 సంవత్సరాల మధ్య ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల వయోసడలింపు ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: రూ.100. 


దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఎంపిక విధానం: రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.


పరీక్ష విధానం: ఆరో తరగతికి మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ- 50 ప్రశ్నలు, అరిథ్‌మెటిక్- 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్&తెలుగు- 25 ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.


ముఖ్యమైన తేదీలు… 


➥ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 22.03.2024.


➥ ప్రవేశ పరీక్ష నిర్వహణ: 21.04.2024.


➥ పరీక్ష ఫలితాల ప్రకటన: 13.04.2024.


➥ మొదటి దశ ప్రవేశాలు: 23.05.2024.


➥ రెండో దశ ప్రవేశాలు: 05.06.2024.


Notification


Online Application


Website


ALso Read:


'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?
TS Model School Admissions: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష-2024 దరఖాస్తు గడువును విద్యాశాఖ అధికారులు పొడిగించారు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 12న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 22తో గడువు ముగిసింది. అయితే విద్యార్థుల సౌలభ్యం మరో పదిరోజులు అంటే మార్చి 2 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.  విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 7న మోడల్ స్కూళ్లు ఉన్న మండల కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి,  మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 25న వెల్లడిస్తారు.  ప్రవేశాలు పొందిన విద్యార్థులకు జూన్ 1న లేదా 2023 - 24 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లలో (మొత్తంగా 19,400 సీట్లు) ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే 7-10 తరగతుల్లోని మిగిలిన ఖాళీలను సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 50 చొప్పున విద్యార్థులు ఉంటారు.
నోటిఫికేసన్, అడ్మిషన్  వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...