ఏపీలోని డిగ్రీ కాలేజీల్లో రానున్న విద్యాసంవత్సరం (2023-24) నుంచి సింగిల్ సబ్జెక్టు డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు ప్రధాన సబ్జెక్టుల కోర్సుల నుంచి సింగిల్‌ సబ్జెక్టుకు మారేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ప్రాసెస్‌ ఫీజు కింద ఒక్కో కళాశాల రూ.5 వేలు చెల్లించాలని, పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపింది. 


ప్రస్తుతం బీఎస్సీ ఆనర్స్‌ (ఎంపీసీ)లో 50 సీట్లుంటే వాటిని గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్టుల్లో ఏదో ఒక దాంట్లో 50 సీట్లను కళాశాల పెట్టుకోవచ్చు. లేదంటే ఒక్కో సబ్జెక్టులో 25 సీట్ల చొప్పున సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మొదటి సంవత్సరం సిలబస్‌ను ఖరారు చేశారు. ప్రధానంగా ఒక సబ్జెక్టు తీసుకుంటే మైనర్‌గా మరో సబ్జెక్టు చదవాల్సి ఉంటుంది. వీటితోపాటు నైపుణ్యాభివృద్ధి కోర్సు ఉంటుంది. మేజర్‌, మైనర్‌ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాంట్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.


Online Application



                               


Also Read:


ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్‌ 1 వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలును ఇంటర్‌బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్‌ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్‌ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


టీఎస్ ఎంసెట్-2023 హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ & మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. 
ఎంసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పాలిసెట్‌ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 17న పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..