ఏపీలోని వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు స్కౌట్స్ & గైడ్స్ కోటా కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ జులై 29న విడుదల చేసింది. ఈ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 1న సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది. ఆగస్టు 1న ఉదయం 11 గంటల నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ను అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ నోటిఫికేషన్‌లోనే పొందుపరిచింది.


అర్హులైన అభ్యర్థులు యూనివర్సిటీలోని సిల్వర్ జూబ్లీ బ్లాక్‌, రెండో అంతస్థులో నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. మొత్తం 65 మంది అభ్యర్థలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు రెండు జతల కాపీలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.


వేదిక: Silver Jubilee Block, 2nd Floor, Dr. YSR University of Health Sciences, Vijayawada 


Notification


Website


ALSO READ:


ఆగస్టు 9 నుంచి నీట్ యూజీ రెండో విడత కౌన్సెలింగ్..
నీట్ యూజీ 2023 రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 9 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి 14 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 15 మధ్య ఆప్షన్ల నమోదు, లాకింగ్ ఉంటుంది. ఆగస్టు 16, 17 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, ఆగస్టు 18న సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 19న పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 28 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


ఆగస్టు 31 నుంచి నీట్ యూజీ  మూడో విడత కౌన్సెలింగ్..
నీట్ యూజీ 2023 రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 31 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 4 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరు సెప్టెంబరు 1 నుంచి 5 వరకు ఆప్షన్ల నమోదు, లాకింగ్ ఉంటుంది. తర్వాత సెప్టెంబరు 6, 7 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, సెప్టెంబరు 8న సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు సెప్టెంబరు 9న పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు సెప్టెంబరు 10 నుంచి సెప్టెంబరు 18 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


మిగిలిపోయిన సీట్లకు స్ట్రే వేకెన్సీ రౌండ్...
మూడువిడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలినపోయిన సీట్లను సెంట్రల్ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీచేస్తారు. సెప్టెంబరు 21 నుంచి 23 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెప్టెంబరు 22 నుంచి 24 మధ్య ఆప్షన్ల నమోదు, లాకింగ్ ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 25న సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, సెప్టెంబరు 26న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు సెప్టెంబరు 27 నుంచి సెప్టెంబరు 30 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


ప్రైవేటు మెడికల్‌ కాలేజీల ఫీజులు ఖరారు, ఫీజులు ఎంతమేర పెరిగాయంటే?
ఏపీలో 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య, డెంటల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులకు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జులై 25న ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఫీజుల అమలు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022–23లో అమలైన ఫీజులను 10 శాతం పెంచుతూ కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..