హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 2023 విద్యా సంవత్సరానికి మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(ఎంపీటీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 7లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 


కోర్సు వివరాలు..


* మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ: 15 సీట్లు


స్పెషాలిటీలు: మస్క్యులోస్కెలెటల్ సైన్సెస్, కార్డియోవాస్కులర్ & పల్మనరీ సైన్సెస్, న్యూరోసైన్సెస్.


కోర్సు వ్యవధి: రెండేళ్లు.


అర్హత: బీపీటీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 31.12.2023 నాటికి 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.5,000; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.4,000.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 07.10.2023.


➥ అప్లికేషన్ హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ: 11.10.2023.


➥ హాల్‌టికెట్ల విడుదల: 28.10.2023.


➥ ప్రవేశ పరీక్షతేది: 02.11.2023.


➥ ఫలితాల వెల్లడి: 04.11.2023.


➥ కౌన్సెలింగ్‌కు తేదీ: 16.11.2023.


➥ తరగతులు ప్రారంభం: 27.11.2023.


Website


Notification & Application:


ALSO READ:


ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు
ఏపీలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబరు 27 నుంచి వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పంచారు. విద్యార్థులు సెప్టెంబ‌రు 27 నుంచి 30 వరకు మొదటి విడత వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్స ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 5 నుంచి 7 వరకు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీ అగ్రికల్చర్‌లో 1062 సీట్లు, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 55 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...