నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) వరంగల్ డిసెంబర్ 2022 సెషన్‌కు గాను పీహెచ్‌డీ ప్రోగ్రామ్(ఫుల్ టైం/పార్ట్ టైం)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు క్యాట్/ గేట్/ యూజీసీ/ సీఎస్ఐఆర్/ ఇన్‌స్పైర్/ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 4వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు
✤ పీహెచ్‌డీ ప్రోగ్రామ్(ఫుల్ టైం/ పార్ట్ టైం)
విభాగాలు:
1. సివిల్ ఇంజనీరింగ్
2. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
3. మెకానికల్ ఇంజనీరింగ్
4. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
5. మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజనీరింగ్
6. కెమికల్ ఇంజనీరింగ్
7. కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్
8. బయోటెక్నాలజీ
9. గణితం
10. భౌతిక శాస్త్రం
11. కెమిస్ట్రీ
12. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్
13. స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు క్యాట్/ గేట్/ యూజీసీ/ సీఎస్ఐఆర్/ ఇన్‌స్పైర్/ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్/ జనరల్-ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు రూ.1600. ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులకు రూ.800.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
🔰 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 04.12.2022.
🔰 రాత పరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు: 20.12.2022 నుంచి 24.12.2022 వరకు.
🔰 ఎంపికైన అభ్యర్థుల వివరాల వెల్లడి: 28.12.2022.
Also Read:
ఆంధ్రా యూనివర్సిటీలో ఆడియో, మ్యూజిక్ కోర్సులు - వివరాలివే!
ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆడియో, మ్యూజిక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. సెయింట్ ల్యూక్స్ ఆడియో ఇంజినీరింగ్ & మ్యూజిక్ ప్రొడక్షన్‌తో కలిసి ఏయూ ఈ కోర్సులకు శ్రీకారం చుట్టింది. వీటిలో 3 నెలలు, 6 నెలలు, ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 6 నెలల, ఏడాది, రెండేళ్ల కాలపరిమితిలో వోకల్ ట్రైనింగ్, ఇన్‌స్ట్రుమెంట్ కోర్సులను కూడా అందిస్తున్నాయి.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు, నవంబరు 25 వరకు గడువు!!
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తోంది. ప్రవేశాలు కోరే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ నవంబర్ 18న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్‌లో డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు.. రాజమండ్రి, శ్రీశైలం క్యాంపస్‌లలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నవంబరు 25లోగా ఆయా వర్సిటీ ప్రాంగణాల్లో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి...
విద్యార్థులకు జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇక ఒకేసారి రెండు డిగ్రీలు!
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా డ్యూయల్ డిగ్రీ కోర్సుకు జేఎన్‌టీయూ శ్రీకారం చుట్టింది. బీటెక్‌తో పాటు బీబీఏ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు వారం రోజుల్లో బీబీఏ(డేటా అనలిటిక్స్)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యాలు ఉంటే సులువుగా ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..