తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, 2023 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీఈ/బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 30లోగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
కోర్సు వివరాలు..
* స్టీల్ టెక్నాలజీ- సెల్ఫ్ సపోర్టింగ్ ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు
కోర్సు వ్యవధి: ఏడాది.
సీట్ల సంఖ్య: 750.
అర్హత: డిప్లొమా/ బీఈ, బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా 60 శాతం మార్కులతో డిప్లొమా/ బీఈ, బీటెక్/ ఎంఎస్సీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.09.2023.
➥ ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్: 09.10.2023.
➥ ఫీజు చెల్లిండానికి చివరితేది: 31.10.2023.
➥ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం: 20.11.2023.
ALSO READ:
JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!
దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 11వ తరగతిలో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..
JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!
దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 9వ తరగతిలో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..
నీట్ పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్, 'సున్నా' మార్కులకు తగ్గిన కటాఫ్!
నీట్ పీజీ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీజీ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ ఏడాది నీట్ పీజీ మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో కటాఫ్ మార్కులను 'సున్నా'కు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేటగిరీలకు ఈ 'జీరో' కటాఫ్ వర్తించనుంది. సున్నా మార్కులు వచ్చినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లే అని ప్రభుత్వం తెలిపింది. మూడో రౌండ్‌లో మొత్తం 13 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో నీట్ పీజీ 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినట్లయింది. ఇందుకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సెప్టెంబరు 20న ఒక ప్రకటన విడుదల చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..