IIT Madras at NIRF Rankings 2024: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్ (NIRF) దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల ఫర్మార్మెన్స్ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తుంది. ఈ క్రమంలో ఎన్ఐఆర్ఎఫ్ ఉత్తమ కాలేజీలు, యూనివర్సిటీలు, అత్యుత్తమ విద్యా సంస్థల జాబితా సోమవారం నాడు విడుదల చేసింది. హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థల్లో ఐఐటీ మద్రాస్ అగ్ర స్థానం కైవసం చేసుకుంది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు (IIT -Bengaluru) 2వ ర్యాంకు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT -Bombay) 3వ ర్యాంకు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (IIT -Delhi) 4వ ర్యాంకు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూ్ర్ (IIT -Kanpur) 5వ ర్యాంకు కైవసం చేసుకుని టాప్ 5 అత్యున్నత విద్యా సంస్థలుగా నిలిచాయి.
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్ పూర్ (IIT - Kharagpur) 6వ ర్యాంకు, ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ (AIIMS - Delhi) 7వ ర్యాంకు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ (IIT - Roorkee) 8వ ర్యాంకు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గువాహతి (IIT - Guwahati) 9వ ర్యాంకు, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ (JNTU - New Delhi) ఎన్ఐఆర్ఎఫ్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ లో 10వ స్థానంలో నిలిచింది.