NEET UG Re-exam Result 2026: మెడికల్ సీటు సాధించాలనే పట్టుదలతో రాత్రిపగలు కష్టపడి నీట్ యూజీ రీ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అలర్ట్! దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు హాజరైన ఈ పరీక్ష ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. జూన్ 21జరిగిన పరీక్ష రిజల్ట్స్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. అసలు ఫలితాల ఎప్పుడు వస్తాయి. మీ స్కోర్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూద్దాం. మీరు గంటల తరబడి వెబ్‌సైట్ల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, అఫీషియల్ వెబ్‌సైట్ neet.nta.nic.in ద్వారా సింగిల్ క్లిక్‌తో మీ ఫలితాలను పొందే ప్రాసెస్ సిద్ధంగా ఉంది.
నీట్ యూజీ రీఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు?
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సమాచారం ప్రకారం నీటి యూజీ రీఎగ్జామ్ రిజల్ట్స్ 2026 వచ్చే నెల అంటే జులై చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్ 21న నిర్వహించిన ఈ రీ టెస్టు కోసం భారీ ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా దేశంలోనిటాప్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతాయి.కాబట్టి ఈ ఫలితాలు అత్యంత కీలకం.
స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ ఎలా?
అభ్యర్థులు తమ రిజిల్ట్స్, స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. మొదటగా అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inను విజిట్ చేయాలి. హోమ్ పేజీలో కనిపించే NEET re-exam Scorecard PDF లింక్‌పై క్లిక్ చేయాలి. మీ అప్లికేషన్ నెంబ్, డేట్ ఆఫ్ బర్త్ వంటి లాగిన్ విరాలను ఎంటర్ చేయాలి. వివరాలు సబ్‌మిట్ చేయగానే నీట్ రీ ఎగ్జామ్ స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం ఒక హార్డ్ కాపీ తీసి పెట్టుకోండి.
ఆన్సర్‌కీ అప్‌డేట్
ఫలితాల కంటే ముందే NTA ఆన్సర్ కీ విడుదల చేయనుంది. గత ఐదేళ్ల ట్రెండ్స్ ప్రకారం జూన్ 28 నాటికి ఆన్సర్ కీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అభ్యర్థులు తమ సమాధానాలను సరిచూసుకోవడమే కాకుండా, ఏదైనా పొరపాట్లు ఉంటే అఫీషియల్ పోర్టల్‌లో అబ్జెక్షన్ విండో ద్వారా అభ్యంతరాలు తెలియజేయవచ్చు. దీని కోసం నిర్ణీత రుసుం చెల్లించి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
