Rajinikanth's Dharman OTT Platform Locked : కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతోన్న యాక్షన్ థ్రిల్లర్ ధర్మన్. తలైవర్ 173 ప్రాజెక్టుగా రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ గురువారం ప్రారంభమైంది. రిలీజ్‌కు ముందే ఓటీటీ, ఆడియో డీల్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. బుధవారం రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

Continues below advertisement

ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్

ధర్మన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌పై సినిమా లాంచ్ ఈవెంట్‌లో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్' సొంతం చేసుకోగా... ఆడియో రైట్స్‌ను ఫేమస్ మ్యూజిక్ కంపెనీ 'సరిగమ' సొంతం చేసుకుంది. షూటింగ్ కూడా ప్రారంభం కాక ముందే రెండు కీలక డీల్స్ క్లోజ్ అవ్వడంతో మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కోలీవుడ్ మల్టీ స్టారర్ రజనీ, కమల్ హాసన్ కాంబోకు ఉన్న పవర్ ఇదేనని సినీ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Continues below advertisement

చెన్నైలో రెగ్యులర్ షూటింగ్

గురువారం (జూన్ 25) నుంచి చెన్నైలో ధర్మన్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రన్, యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో డాక్టర్ పాత్రలో తలైవా నటిస్తుండగా ఫస్ట్ లుక్ ట్రెండ్ అవుతోంది. త్వరలోనే మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

Also Read : Priyadarshi Idupukayitham : తెలంగాణ నేపథ్యంలో ఇడుపు కాయితం - హీరోగా ప్రియదర్శి... హీరోయిన్‌గా ఫేమస్ ఫోక్ సింగర్

డాక్టర్‌, అణు సైంటిస్ట్‌గా తలైవా

ఈ సినిమాలో తలైవా డాక్టర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీకి 'ది డెడ్లీ డాక్టర్' అనే ట్యాగ్ లైన్ ఫిక్స్ చేశారు. ఆపరేషన్ థియేటర్లో చేతిలో సర్జికల్ సిజర్స్‌తో రజనీ పోస్టర్ ట్రెండ్ అవుతోంది. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ఓ సైంటిస్ట్‌గా తాను కనిపించబోతున్నట్లు తలైవా చెప్పారు. మెడికల్ సైన్స్ బ్యాక్ డ్రాప్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా 'ధర్మన్' తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్స్ మార్పుపై...

చాలా మంది డైరెక్టర్స్ అనుకున్న తర్వాత అశ్వత్ మారిముత్తు ఈ మూవీకి డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యారు. దీనిపై తలైవా రియాక్ట్ అయ్యారు. 'ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చిన నాలుగో దర్శకుడు అశ్వత్ మారిముత్తు. ఫస్ట్ కెఎస్ రవికుమార్‌తో చేయాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత సుందర్ సి ఇతర ప్రాజెక్టుల కారణంగా వైదొలిగారు. శిబి చక్రవర్తి... అను శాస్త్రవేత్త, అణ్వాయుధాల నేపథ్యంలో సాగే ఓ సెన్సిటివ్ కథాంశం, చిత్రీకరణకు ఎక్కువ టైం పట్టేలా అనిపించడంతో ఇప్పుడు చేయకూడదనుకున్నాం. అప్పుడే అశ్వత్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు.' అని తెలిపారు.

కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Shanmukh Jaswanth : నిన్న ఆస్పత్రి బెడ్‌పై... ఇవాళ షూటింగ్ సెట్‌లో - షణ్ముఖ్ జస్వంత్ పోస్ట్ వెనుక స్టోరీ ఏంటి?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.