NEET PG, NEET MDS 2024 Exams Dates: నీట్ పీజీ(NEET PG), నీట్ ఎండీఎస్(NEET MDS) ప్రవేశ పరీక్షల తాత్కాలిక తేదీలను 'నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS)' నవంబరు 9న ప్రకటించింది. దీనిప్రకారం మార్చి 3న నీట్ పీజీ-2024(NEET PG Exam 2024) పరీక్ష నిర్వహించనున్నారు. ఇక నీట్ ఎండీఎస్ పరీక్షను ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి తాత్కాలిక తేదీలను ప్రకటించినప్పటికీ.. త్వరలోనే కచ్చితమైన తేదీలను ఎన్టీఏ ప్రకటించనుంది.
నీట్ పీజీ ప్రవేశపరీక్ష ద్వారా ఎండీ/ఎంఎస్/పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్‌బీ కోర్సులు, ఆరేళ్ల డీఆర్‌ఎన్‌బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ ఎన్‌బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ లేదా ప్రొవిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 ప్రకారం శాశ్వత లేదా తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
నీట్ ఎండీస్ పరీక్ష రాయడానికి బీడీఎస్ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్ పూర్తిచేసినవారు అర్హులు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
నీట్ పీజీ పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పీజీ ప్రవేశ పరీక్షను మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రశ్నలు ఉంటాయి.
నీట్ ఎండీఎస్ పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పీజీ ప్రవేశ పరీక్షను మొత్తం 960 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల నుంచి 240 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రశ్నలు ఉంటాయి.
తెలంగాణ లాసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల..
తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్/పీజీఎల్‌సెట్-2023 ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి నవంబరు 9న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్ 14 నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఈ మేరకు నవంబర్ 9న రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి నేతృత్వంలో జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారు చేశారు. లాసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 11న విడుదల చేయనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ 'హార్టిసెట్-2023' నోటిఫికేషన్ విడుదల..
ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఉద్యానవన డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు 'హార్టిసెట్-2023' నోటిపికేషన్ విడుదల చేసింది. హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా(పాలిటెక్నిక్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఎస్సీ ఆనర్స్ (హార్టికల్చర్) డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు నవంబరు 28లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.350 చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..