PG Medical Admissions 2022: అఖిల భారత కోటాలో తొలివిడత పీజీ వైద్యవిద్య కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 15 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ సెప్టెంబరు 10న ఒక ప్రకటనలో తెలిపింది. రెండోవిడత కౌన్సెలింగ్‌ అక్టోబరు 10 నుంచి 18 వరకూ కొనసాగుతుంది. రాష్ట్ర స్థాయి పీజీ వైద్యవిద్య తొలివిడత కౌన్సెలింగ్‌ను సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 4 వరకు, రెండో విడత అక్టోబరు 15 నుంచి 26 వరకు వరకు నిర్వహిస్తారు.  మరోవైపు రాష్ట్రంలో 2022-23 వైద్యవిద్యా సంవత్సరానికి ప్రభుత్వ రంగంలో కొత్తగా 1200 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే మహబూబాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కొత్తగూడెం వైద్య కళాశాలలకు ఒక్కో దాంట్లో 150 చొప్పున కొత్తగా 900 సీట్లకు అనుమతి లభించింది. రామగుండంలో 150 సీట్లకు అనుమతి ఇవ్వడానికి అంగీకార పత్రాన్ని (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌) జాతీయ వైద్య కమిషన్‌ ఇప్పటికే పంపించింది. ఇక మంచిర్యాలకు మాత్రమే అనుమతి రావాల్సి ఉంది. ఈ కళాశాలకు కూడా 150 సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి.



Counseling Schedule PG 2022 



NEET PG COUNSELLING INFORMATION BULLETIN & COUNSELLING SCHEME


 


ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 1 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. అయితే, కొత్త కాలేజీలు, కోర్సుల ఏర్పాటు, సీట్ల పెంపుపై సెప్టెంబరు 15 నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మరిన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నిర్ణయించినట్టు ఆగస్టు 28న ఎన్‌ఎంసీ తెలిపింది. ఈ ఏడాది మే 21న నీట్ పీజీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. నీట్ పీజీ కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలల్లో 52 వేల పీజీ వైద్య విద్య సీట్లను భర్తీ చేస్తారు. ఈ సీట్ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న కళాశాలలకు ఇప్పటికీ జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) సీట్లను ఇచ్చే ఉద్దేశంతో 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' జారీచేస్తుంది. ఇచ్చిన తర్వాత మరోసారి ఎన్‌ఎంసీ నిపుణుల బృందం ఆయా కళాశాలలను పరిశీలించి, అవసరమైన పూచీకత్తులను స్వీకరించి, సీట్లకు పూర్తిస్థాయిలో అనుమతులిస్తుంది. కానీ సీట్ల పెంపుపై అస్పష్టత కారణంగా కౌన్సెలింగ్ వాయిదా వేశారు. ఇప్పుడు సీట్ల ముడిపై స్పష్టత రావడంతో కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది.



ప్రవేశ ప్రక్రియ ప్రారంభించనున్న నేపథ్యంలో ఇలా లెటర్  ఆఫ్  ఇంటెంట్  ఇవ్వడం వల్ల ఆయా సీట్లను ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధత నెలకొంది. పైగా ఎన్ని సీట్లను కన్వీనర్  కోటా కింద లెక్కలోకి తీసుకుంటే.. అందులో సగం సీట్లను అఖిల భారత కోటాలో ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన వాటినే రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసుకోవాలి. ఇంత సంక్లిష్టత నెలకొనడంతో తాజాగా డీజీహెచ్ఎస్ఈ అంశంపై స్పష్టతనిస్తూ అన్ని రాష్ట్రాలకూ లేఖ రాసింది. ప్రవేశ ప్రకటన వెలువరించడానికి ముందు ఎన్ని సీట్లకు అనుమతి లభిస్తుందో... ఆ సీట్లను మాత్రమే ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టీకరించింది. లెటర్  ఆఫ్  ఇంటెంట్  ఇచ్చిన సీట్లను ప్రవేశాల జాబితాలో పొందుపరచవద్దని తెలిపింది. దీంతో ఇప్పటివరకూ అనుమతి ఉన్న పీజీ సీట్లకే ప్రవేశ ప్రకటన వెలువరించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి.



తెలంగాణ  రాష్ట్రంలో 2070 పీజీ వైద్యవిద్య సీట్లుండగా రెండు వైద్య కళాశాలల నుంచి గతేడాది ప్రవేశాలు పొందిన 130 పీజీ సీట్లను రద్దు చేస్తూ ఎన్ ఎంసీ నిర్ణయం తీసుకుంది. వీటిని ఇంకా సర్దుబాటు చేయలేదు. 2022-23 సంవత్సరానికి ఎలాగూ వీటికి అనుమతి లభించదు. దీంతో ఆ మేరకు సీట్లను కోల్పోయినట్లయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 200కి పైగా పీజీ సీట్లు ఈ ఏడాది కొత్తగా వచ్చే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి. ఇంకా అనుమతి లేఖలు రాకపోవడంతో తొలివిడత ప్రవేశాలనాటికి వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశాల్లేవు. తగ్గిన సీట్లతోనే ఈసారి పీజీ వైద్యవిద్య ప్రవేశ ప్రకటన వెలువరించే అవకాశాలున్నాయని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి.


ఒకవేళ తొలివిడత ప్రవేశ ప్రకటన తర్వాత గనుక అనుమతి వస్తే అప్పుడు కొత్తగా వచ్చిన పీజీ సీట్లను తరువాత విడత కౌన్సెలింగ్ లకు లెక్కలోకి తీసుకుంటామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి లెటర్  ఆఫ్  ఇంటెంట్  ఇచ్చిన సీట్లకు అనుమతి ఇవ్వడానికి ముందు ఇంకా ఏమైనాలోపాలను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటే.. ఆయా కళాశాలల నుంచి పూచీకత్తు స్వీకరిస్తారని, ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఇదే విషయంలో సర్కారు పూచీకత్తుగా వ్యవహరిస్తుందని వైద్యవర్గాలు వివరించాయి.


 


Also Read:

సీయూఈటీ యూజీ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
దేశంలోని వివిధ ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలు సెప్టెంబర్15వ తేదీలోగా వెలువడుతాయని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. డిగ్రీ కోర్సులకు తొలిసారిగా నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జులైలో ప్రారంభమై ఆగస్టు 30న ముగిశాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సెప్టెంబర్15 నాటికి వెల్లడిస్తుందని, సాధ్యమైతే ఆ తేదీ కన్నా రెండు రోజులు ముందే ప్రకటించే అవకాశం ఉందన్నారు.
ఫలితాల పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


 


Also Read:


KNRHUS: కాళోజీ హెల్త్ వ‌ర్సిటీ ప‌రీక్షలు వాయిదా, కొత్త తేదీలివే!
తెలంగాణలోని కాళోజీ నారాయణ‌రావు ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలో సెప్టెంబరు 9న జ‌ర‌గాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్‌ వెల్లడించారు. గణేశ్‌ నిమజ్జనం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 9న సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు. ఎంబీబీఎస్ రెండో సంవ‌త్సరం, బీడీఎస్ చివరి సంవత్సరం, పోస్ట్ బేసిక్ నర్సింగ్ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా పడిన ఎంబీబీఎస్ మైక్రో బయాలజీ పరీక్ష సెప్టెంబరు 19న, బీడీఎస్ పెరియోడొంటాల‌జీ సెప్టెంబరు 21న, పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఇంగ్లిష్‌ పరీక్షను సెప్టెంబరు 30న నిర్వహించనున్నారు. అయితే, సెప్టెంబరు 12 నుంచి జ‌రగాల్సిన‌ పరీక్షలన్నీ య‌ధావిధిగా జరుగుతాయని విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ వెల్లడించారు.
పరీక్ష కొత్తతేదీల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..