➥ దేశవ్యాప్తంగా 271 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ 


➥ పరీక్షకు హాజరుకానున్న 2 లక్షలకు పైగా విద్యార్హులు


➥ మార్చి 31లోపు ఫలితాల వెల్లడి


దేశవ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి గానూ మెడికల్‌ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి మార్చి 5 నీట్‌ పీజీ -2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. నీట్‌ పీజీలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నీట్‌ పీజీ-2023 ప్రవేశ పరీక్ష కోసం 10 కేంద్రాలను (హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సత్తుపల్లి, సూర్యాపేట, కోదాడ) ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,453 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య విద్యాసంస్థల్లో 1,393, ప్రైవేటులో 1,060 సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 271 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.


నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో మొత్తం 200 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటల 30 నిమిషాలపాటు నిర్వహిస్తారు. నీట్ పీజీ పరీక్ష ఫలితాలను మార్చి 31లోపు వెల్లడించనున్నట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (NBE) ఇప్పటికే పేర్కొంది. ఢిల్లీ ఎయిమ్స్‌తో పాటు దేశంలోని ఇతర ఎయిమ్స్‌, చండీగఢ్‌ పీజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, పుదుచ్చేరిలోని జిప్‌మెర్‌, బెంగళూరులోని నిమ్‌హాన్స్‌, త్రివేండ్రంలోని చిత్ర తిరునాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థల్లో అడ్మిషన్లకు నీట్‌ ప్రవేశ పరీక్ష వర్తించదని ఎన్‌బీఈ తెల్పింది.


నీట్ పీజీ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..


మార్చి 5న పరీక్షలు నిర్వహిస్తే ప్రిపేర్ అయ్యేందుకు సమయం చాలదని.. అందువల్ల మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నీట్ పీజీ పరీక్ష వాయిదా డిమాండ్‌పై దేశ రాజధాని నగరంలో ఆందోళనలు కూడా చేపట్టారు. నీట్ పీజీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు సైతం దిగారు. కటాఫ్ తేదీల విషయంలో విద్యార్థుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం నీట్ పీజీ ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని పెంచిన విషయం తెలిసిందే. 


నీట్ పీజీ 2023 ప్రవేశపరీక్ష ద్వారా ఎండీ/ఎంఎస్/పీజీ డిప్లొమా కోర్సు్లో ప్రవేశాలు కల్పిస్తారు. పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్‌బీ కోర్సులు, ఆరేళ్ల డీఆర్‌ఎన్‌బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ ఎన్‌బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.


పరీక్ష విధానం..
కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పీజీ ప్రవేశ పరీక్షను మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రశ్నలు ఉంటాయి.


పరీక్షలో మార్కుల వెయిటేజీ ఇలా...


➥ 'పార్ట్-ఎ'లో 50 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో అనాటమీ-17, ఫిజియోలజీ-17, బయోకెమిస్ట్రీ-16 ప్రశ్నలు అడుగుతారు. 


➥ 'పార్ట్-బి'లో 100 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో పాథాలజీ-25, ఫార్మకాలజీ-20, మైక్రోబయాలజీ-20, ఫోరెన్సిక్ మెడిసిన్-10, సోషల్ & ప్రివెంటివ్ మెడిసిన్-25 ప్రశ్నలు అడుగుతారు.


➥ 'పార్ట్-బి'లో 150 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో జనరల్ మెడిసిన్- డెర్మటాజీ & వెనెరియోలజీ & సైకియాట్రీ - 45 ప్రశ్నలు, జనరల్ సర్జరీ - ఆర్థోపెడిక్స్, అనస్థీషియా, రేడియోడయాగ్నసిస్-45 ప్రశ్నలు, అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ-30 ప్రశ్నలు, పీడియాట్రిక్స్610 ప్రశ్నలు, ఈఎన్‌టీ-10 ప్రశ్నలు, ఆప్తాల్మాలజీ-10 ప్రశ్నలు అడుగుతారు.


అర్హత మార్కులు.. 
పరీక్షలో అర్హత మార్కులను జనరల్/ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 50 పర్సంటైల్, జనరల్(PwD) అభ్యర్థులకు 50 పర్సంటైల్, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (PwD కలిపి) అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు. 


అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


➥ నీట్ ప్రవేశపరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. మార్చిన 5న ఒకే సెషన్‌లో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. 


➥ NBEMS సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, సురక్షితమైన వాతావరణంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనుంది.


➥ అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ అడ్మిట్ కార్డులతో 'రిపోర్టింగ్ కౌంటర్' వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.


➥ పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగా 'రిపోర్టింగ్ కౌంటర్' మూసివేస్తారు. కాబట్టి అభ్యర్థులు వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం ఉత్తమం.


➥ సూచించిన సమయంలోపు అభ్యర్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సమయం ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు.


➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంటతీసుకురావాలి.


➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు జ్వరం ఉందోలేదో తెలుసుకోవడానికి శరీర ఉష్ణోగ్రతను ధర్మోగన్‌‌తో చెక్ చేస్తారు.


➥ పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, కాలిక్యులేటర్లు, పర్సులు, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులేవి అనుమతించరు.


Also Read:


జేఈఈ మెయిన్ మాక్ టెస్టులు అందుబాటులో! ఎలా యాక్సెస్ చేయాలంటే?
జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్య 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉచితంగానే ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయవచ్చు. 
మాక్ టెస్ట్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..