నీట్ పీజీ 2023, ఎండీఎస్, ఇతర పరీక్షల తేదీలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేసింది. పరీక్షల షెడ్యూలును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు పరీక్షల తేదీలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పరీక్షలకు సంబంధించి ప్రస్తుతానికి ఇవే తేదీలను పరిగణనలో ఉంటాయి. తదుపరి సమాచారం వచ్చేవరకు ఇవే పరీక్షల తేదీలు అమల్లో ఉంటాయి. పరీక్షల ముందు పరీక్షల తేదీలను వేర్వేరుగా వెల్లడిస్తారు. అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన పూర్తిసమాచారం, దరఖాస్తు, ఇతర పూర్తి వివరాలను సంబంధిత అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
NBEMS ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పరీక్షల తేదీలివే..
నీట్ పరీక్షలు:
* NEET-MDS 2023 పరీక్ష తేదీ: 08.01.2022.
* NEET-PG 2023 పరీక్ష: 05.03.2023.
ఇతర పరీక్షల తేదీలు..
* DNB/DrNB ఫైనల్ ప్రాక్టికల్ పరీక్షలు (జూన్-2022): అక్టోబరు/నవంబరు 2022.
* ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) డిసెంబరు-2022: 04.12.2022.
* ఫారిన్ డెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ (FDST) 2022: 04.12.2022.
* ఫార్మాటివ్ అసెస్‌మెంట్ టెస్ట్ (FAT) 2022: 10.12.2022
* DNB/DrNB ఫైనల్ థియరీ పరీక్షలు (డిసెంబరు 2022): 2022 డిసెంబరు 21, 22, 23, 24 తేదీల్లో.
* ఫెలోషిప్ ఎంట్రెన్స్ టెస్ట్ (FET)- 2022): 20.01.2023
* FNB ఎగ్జిట్ ఎగ్జామినేషన్ 2022: 2023 ఫిబ్రవరి/మార్చి.
* DNB/DrNB ఫైనల్ ప్రాక్టికల్ పరీక్షలు (డిసెంబరు-2022): 2023 ఫిబ్రవరి/మార్చి/ఏప్రిల్.
NBEMS Communication Web Portal
Also Read:
NVS: నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. రాతపరీక్ష ఆధాంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశప్రకటన, ఎంపిక విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్ విడుదల
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏడాదిలో రెండు సార్లు దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంటుంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో సూచించినట్లు ఇంటర్, డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..