నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ పీజీ)-2023 అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ఫిబ్రవరి 27న విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నీట్ పీజీ-2023 పరీక్ష యథాతదంగా మార్చి 5న కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనుంది.
పరీక్ష వాయిదా వేయాలంటూ దేశ వ్యాప్తంగా మెడికల్ విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా అందుకు కేంద్రం ససేమిరా అంది. తాజాగా సుప్రీం కోర్టులో కూడా నీట్ పీజీ-2022 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిని విచారించిన అత్యున్నత ధర్మాసనం పరీక్షను వాయిదా వేయడం వల్ల విద్యార్ధుల్లో గందరగోళం, అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని తీర్పునిచ్చింది. దీంతో పరీక్ష ముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే జరగనుంది. పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు లేదని ఇప్పటికే మెడికల్ బోర్డు కూడా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 271 పరీక్ష కేంద్రాల్లో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
NEET PG 2023 అడ్మిట్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
➥ అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - nbe.edu.in
➥ అక్కడ హోమ్‌పేజీలో కనిపించే ‘NEET PG’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
➥ అభ్యర్థికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్, అవసరమైని ఇతర వివరాలతో లాగిన్ అవ్వాలి.
➥ వెంటనే స్క్రీన్ పై NEET PG Admit Card 2023 ఓపెన్ అవుతుంది.
➥ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి.
Also Read:
సీపెట్ అడ్మిషన్ టెస్ట్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) 2023 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల ప్రవేశాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కోర్సు అనుసరించి పదవతరగతి, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250. నార్త్ ఈస్ట్రర్న్ రిజీయన్ అభ్యర్థులు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. కంప్యూటర్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేట్ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..