NEET 2025 Results: నీట్‌ 2025 ఫలితాలు ఇవాళ(14 జూన్‌ 2025) విడుదలకానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ ఈ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో పెట్టనుంది. ఫలితాలు ఏ క్షణమైనా విడుదల చేయవచ్చు. కాబట్టి అభ్యర్థులు నిరంతరం అధికారిక వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండాలి.  


ఫైనల్ ఆన్సర్ కీ విడుదల
ఫలితాల విడుదలకు ముందు NTA NEET 2025 ఫైనల్ ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది. అభ్యర్థులు తమ ప్రశ్నలకు సరైన సమాధానాలను ఈ ఆన్సర్ కీ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఎలాంటి లాగిన్ క్రెడెన్షియల్స్ అవసరం లేదు. నేరు ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  


NEET 2025 ఫలితాలు ఎలా తనిఖీ చేయాలి?
NEET 2025 ఫలితాలు ఆన్‌లైన్‌లో మాత్రమే విడుదల చేస్తారు. ఫలితాలు తనిఖీ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 



  • ముందు neet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

  • NEET 2025 స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.

  • NEET 2025 అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ (లేదా ఇమెయిల్/మొబైల్ నంబర్), సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయండి.  

  • సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

  • స్క్రీన్‌పై NEET 2025 స్కోర్‌కార్డ్ కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి.


మెరిట్ లిస్ట్ అండ్‌ స్కోర్‌కార్డ్
NEET 2025 మెరిట్ లిస్ట్‌ను NTA విడుదల చేస్తుంది. ఈ లిస్ట్‌లో టాప్‌ర్లు, విజేతల పేర్లు (సుమారు 50 నుంచి 100 మంది) ఉంటాయి. ఈ మెరిట్ లిస్ట్ అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ, స్కోర్‌కార్డ్ ప్రతి అభ్యర్థికి వారి లాగిన్ వివరాలతో మాత్రమే అందుబాటులో ఉంటుంది.


ముఖ్యమైన వివరాలు
NEET 2025 స్కోర్‌కార్‌లో ఈ వివరాలు ఉంటాయి:



  • అభ్యర్థి పేరు, ఫోటో, రోల్ నంబర్ ఉంటుంది. 

  • సబ్జెక్ట్‌ల ప్రకారం ఎన్ని మార్కులు వచ్చాయో ఉంటాయి. 

  • మొత్తం స్కోర్ ఎంత వచ్చిందో కూడా ఉంటుంది. 

  • సబ్జెక్ట్‌ల ప్రకారం పర్సెంటైల్ కూడా ఇస్తారు. 

  • మొత్తం పర్సెంటైల్ చూసుకోవచ్చు. 

  • ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అనేది ఉంటుంది. 

  • క్వాలిఫైయింగ్ పర్సెంటైల్ కూడా ఇస్తారు. 


NEET 2025 ఫలితాలు UMANG, Digilocker వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.


NTA, NEET 2025 స్కోర్‌కార్డ్‌ను ఇమెయిల్ లేదా WhatsApp ద్వారా పంపరు. అభ్యర్థులు మాత్రమే అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి డౌన్‌లోడ్ చేసుకోవాలి.


NEET 2025 ఫైనల్ ఆన్సర్ కీ ప్రత్యేకతలు
NEET 2025 ఫైనల్ ఆన్సర్ కీలో కొన్ని ప్రశ్నలకు రెండు సరైన సమాధానాలు ఉన్నాయి. ఉదాహరణకు టెస్ట్ బుక్‌లెట్ 45లో ప్రశ్న 63, బుక్‌లెట్ 46లో ప్రశ్న 54, బుక్‌లెట్ 47లో ప్రశ్న 58, బుక్‌లెట్ 48లో ప్రశ్న 51కు రెండు సరైన సమాధానాలు ఉన్నాయి. అప్పుడు ఏదైనా ఒక సరైన సమాధానాన్ని మార్క్ చేసిన అభ్యర్థికి మార్కులు ఇస్తారు. 


NEET 2025 కట్-ఆఫ్ అండ్‌ పర్సెంటైల్
NEET 2025 కట్-ఆఫ్ వీటి ఆధారంగా నిర్ణయిస్తారు. పరీక్షకు హాజరైన మొత్తం అభ్యర్థుల సంఖ్య, పరీక్ష స్థాయి, అభ్యర్థుల పనితీరు, ఉన్న సీట్ల సంఖ్య, గత సంవత్సరాల కట్-ఆఫ్‌ను బేసే చేసుకొని ఈ ఏడాది కట్-ఆఫ్ అండ్‌ పర్సెంటైల్‌ డిసైడ్ చేస్తారు. 


NEET 2025 కట్-ఆఫ్ పర్సెంటైల్ ఇలా ఉండొచ్చు 


జనరల్/UR, EWS: 50


OBC, SC, ST: 40


జనరల్/UR/EWS-PwD: 45


OBC, SC, ST-PwD: 40