నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫైర్‌, సేఫ్టీ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో ఫైర్‌, హెల్త్‌ సేఫ్టీ కోర్సుల్లో గ్రేటర్‌  పరిధిలోని విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి అక్టోబరు 8న ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, ఫైర్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, సబ్‌ ఫైర్‌ ఆఫీసర్‌, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, డిప్లొమా ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పూర్తయ్యాక పరిశ్రమలు, ఎయిర్‌పోర్టు, ఆయిల్‌ కంపెనీలు, గ్యాస్‌, ఫార్మా ఇండస్ట్రీస్‌, రైల్వేస్‌ సంస్థలలో అవకాశాలు లభిస్తాయని వివరించారు.  ఆసక్తి ఉన్నవారు అక్టోబరు 18 లోపు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 97014 96748 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.


వివరాలు..


* ఫైర్‌ & సేఫ్టీ ఇంజినీరింగ్‌ కోర్సులు


1)  పీజీ డిప్లొమా ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌


2) ఫైర్‌ టెక్నాలజీ


3) ఇండస్ట్రియల్‌ సేఫ్టీ


4)  సబ్‌ ఫైర్‌ ఆఫీసర్‌


5) హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌


6) డిప్లొమా ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌


అర్హత: ఇంటర్ లేదా ఆపై అర్హతలున్నవారు దరఖాస్తుకు అర్హులు.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.100.


సంప్రందించాల్సిన ఫోన్ నెంబర్: 97014 96748 


కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


Website


సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ..
తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ విమలారెడ్డి అక్టోబరు 2న ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ ఎథికల్‌ హ్యాకింగ్‌ సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఈ కోర్సులకు ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 13 లోపు ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇత వివరాలకు 78931 41797లో సంప్రదించాలని విమలారెడ్డి సూచించారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం, రెండు పరీక్షలు రాయడం తప్పనిసరేమీ కాదు
దేశంలో ఏటా రెండుసార్లు నిర్వహించాలనుకుంటున్న సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలకు రెండింటికీ హాజరవడం తప్పనిసరేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ తెలిపారు. ఈ మేరకు అక్టోబరు 8న పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు. 
పూర్తివివరాల కోసంక్లిక్ చేయండి..


అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీలో డిగ్రీ కోర్సులు, వివరాలు ఇలా!
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ బెంగళూరు, భోపాల్‌లోని క్యాంపస్‌లలో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..




అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీలో పీజీ కోర్సులు, వివరాలు ఇలా!
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ బెంగళూరు, భోపాల్‌లోని క్యాంపస్‌లలో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 'స్పాట్‌' కౌన్సెలింగ్‌, ఎప్పుడంటే?
గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అక్టోబర్ 11న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామారావు అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. గుంటూరులోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం లాంఫాం పాలిటెక్నిక్‌ విభాగంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...