నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్(ఎన్‌సీసీఎస్‌) పుణె ప్రాజెక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న వారు, ఎంఎస్సీ, ఎంఫార్మసీ, ఎంటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 


వివరాలు..


* ప్రాజెక్ట్ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం(బయోలాజికల్ సైన్సెస్)


శిక్షణ వ్యవధి: 6 నెలలు.


అర్హత: బీఈ, బీటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న వారు, ఎంఎస్సీ, ఎంఫార్మసీ, ఎంటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తుకు అర్హులు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.


ముఖ్యమైన తేదీలు… 


➥ ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 01.05.2023.


➥ ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 22.05.2023.


Notification 


Website



Also Read


ఇంటర్ అర్హతతో ఎంబీఏ ప్రవేశానికి 'జిప్‌మ్యాట్‌' మార్గం, నోటిఫికేషన్ విడుదల!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బోధ్‌గయ, ఐఐఎం జమ్మూ ఉమ్మడిగా అందిస్తున్న 'ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం)లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) - 2023 నోటిఫికేషన్‌‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ ఎంబీఏ కోర్సులో చేరవచ్చు. 
ప్రవేశ పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


ఇంటర్‌ అర్హతతో ఎంబీఏ, ప్రవేశ ప్రకటన విడుదల చేసిన ఇండోర్ ఐఐఎం!
ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఐదేళ్ల 'ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)' కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. మొదటి మూడేళ్లు ఫౌండేషన్, తర్వాత రెండేళ్లు మేనేజ్‌మెంట్ విద్యపై దృష్టి సారిస్తారు. తొలి భాగంలో భాష, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు; మేనేజ్‌మెంట్ విద్య ప్రాథమికాంశాలు, నైతిక విలువలు అర్థం చేసుకునే నైపుణ్యం, శారీరక ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. చివరి రెండేళ్లు లక్ష్యం దిశగా బోధన ఉంటుంది.
ప్రవేశపరీక్ష, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి.. 


వచ్చే ఏడాది నుంచి సాధారణ డిగ్రీలో మార్పులు, డిగ్రీతోపాటు ఆనర్స్ డిగ్రీ చేయొచ్చు!
తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యలో మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. ఒకేసారి రెండు డిగ్రీలను పూర్తి చేసేందుకు యూజీసీ వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సాధారణ డిగ్రీలో ఒక పక్క ఆనర్స్, మరో పక్క ఒకే సబ్జెక్టు ప్రాధాన్య కోర్సును తీసుకురానున్నారు. 2020-21లో ప్రవేశపెట్టిన ఆనర్స్‌ డిగ్రీకి సంబంధించి నాలుగో ఏడాది సిలబస్‌ను ఖరారు చేశారు. దీంతోపాటు ఇప్పటివరకు మూడు సబ్జెక్టుల ప్రాధాన్యంగా ఉన్న డిగ్రీని ఒక సబ్జెక్టు విధానానికి మార్చుతున్నారు. యూజీసీ, జాతీయ విద్యా విధానం సూచనల ప్రకారం ఉన్నత విద్యామండలి ఈ మార్పులు చేస్తోంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..