AIAPGET 2024: దేశంలోని ఆయుష్ కళాశాలలు, విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగాను ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి విభాగాల్లో ఎండీ, ఎంఎస్ కోర్సు ప్రవేశాలకు సంబంధించి 'ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (AIAPGET)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీఏఎంఎస్ (BAMS), బీయూఎంఎస్ (BUMS), బీఎస్‌ఎంఎస్ (BSMS), బీహెచ్‌ఎంఎస్ (BHMS), గ్రేడెడ్ బీహెచ్‌ఎంఎస్ (Graded BHMS) డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తిచేసినవారు దరఖాస్తుకు అర్హులు.
సరైన అర్హతలున్నవారు మే 15లోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే మే 16 వరకు నిర్ణీత ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.2700; ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులు రూ.2450; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1800; థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జులై 2 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఏపీలో అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలు..
* ఆల్ ఇండియా ఆయుష్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (ఏఐఏపీజీఈటీ) 2024
అర్హత: బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్‌ఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, గ్రేడెడ్ బీహెచ్‌ఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.2700; ఈడబ్ల్యూఎస్, ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులు రూ.2450; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1800; థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి.
పరీక్ష విధానం: మొత్తం 480 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఆయుర్వేదం పేపరును ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో; హోమియోపతి పేపరును ఇంగ్లిష్; సిద్దా పేపరును ఇంగ్లిష్, తమిళంలో; యునానీ పేపరును ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 15.05.2024.
➥ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 16.05.2024. (11:50 P.M.)
➥ దరఖాస్తు సవరణకు అవకాశం: 17.05.2024 - 19.05.2024 వరకు.
➥ అడ్మిట్ కార్డులు విడుదల: 02.07.2024 నుంచి.
➥ పరీక్ష తేదీ: 06.07.2024.
ALSO READ:
ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు
చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ)లో 2024-25 విద్యాసంవత్సరానికి పీజీ, యూజీ, డీఎన్‌ఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతతో పాటు గేట్/ సీయూఈటీ/ పీజీ సెట్/ క్యాట్/ మ్యాట్/ సీమ్యాట్ స్కోరు ఉండాలి. ఐఎంయూ సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. ఐఎంయూ క్యాంపస్‌లు నవీ ముంబయి, ముంబయి పోర్ట్, కోల్‌కతా, విశాఖపట్నం, చెన్నై, కొచ్చిలో ఉన్నాయి. డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు డిగ్రీ విద్యార్హత, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులో పీజీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు మే 5 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..