NIFT Admissions: 'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు 'నిఫ్ట్-2024' నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా

NIFT: దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT), క్యాంపస్‌లలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.

Continues below advertisement

NIFT Admissiosn 2024-25: దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT), క్యాంపస్‌లలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) నిర్వహించే ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. యూజీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Continues below advertisement

సరైన అర్హతలున్నవారు నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి, గడువులోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. యూజీ, పీజీ కోర్సులకు జనవరి 3లోగా, పీహెచ్‌డీ కోర్సులకు ఫిబ్రవరి 29లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. యూజీ, పీజీ కోర్సులకు ఫిబ్రవరి 5న, పీహెచ్‌డీ ప్రవేశాలకు మే మొదటివారంలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.

కోర్సు వివరాలు..

* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రవేశాలు (NIFT - 2024)

నిఫ్ట్ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్‌, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్‌పుర్, కాంగ్రా, కన్నూర్, ముంబయి, న్యూదిల్లీ, పట్నా, పంచకుల, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్.

➥ బ్యాచిలర్ ప్రోగ్రామ్స్

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.

బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్(బీడీఈఎస్‌)

విభాగాలు: ఫ్యాషన్ డిజైన్/ లెదర్ డిజైన్/ యాక్సెసరీ డిజైన్/ టెక్స్‌టైల్ డిజైన్/ నిట్‌వేర్ డిజైన్/ ఫ్యాషన్ కమ్యూనికేషన్.

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్) ప్రోగ్రామ్

➥ మాస్టర్స్ ప్రోగ్రామ్‌

కోర్సు వ్యవధి: రెండేళ్లు. 

మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ (ఎండీఈఎస్‌)

మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ (ఎంఎఫ్‌ఎం)

మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్‌)

➥ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

విభాాగాలు: డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ.

అర్హతలు: యూజీ ప్రోగ్రామ్‌కు 10+ 2 పరీక్షలో ఉత్తీర్ణత; పీజీ ప్రోగ్రామ్‌కు ఏదైనా డిగ్రీ లేదా బీఎఫ్‌టెక్‌, బీఈ, బీటెక్‌; పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: యూజీకి 24 సంవత్సరాలు మించకూడదు. పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు వయోపరిమితి లేదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.3000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1500 చెల్లించాలి. ఇక రెండు కోర్సులకు దరఖాస్తుకునేవారు రూ.4500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ.2250 చెల్లిస్తే సరిపోతుంది.

ముఖ్యమైన తేదీలు..

యూజీ, పీజీ ప్రోగ్రామ్

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 03.01.2024.

➥ రూ.5000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.01.2024 నుంచి 08.01.2024 వరకు.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 10.01.2024 నుంచి 12.01.2024 వరకు.

➥ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్‌: జనవరి మూడో వారం, 2024.

➥ డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్షతేది: 05.02.2024.

➥ ఫలితాల వెల్లడి: మార్చి, 2024.

➥ సిట్యుయేషన్ టెస్ట్/ ఇంటర్వ్యూ: ఏప్రిల్, 2024.

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ప్రారంభం: 15.01.2024.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 29.02.2024.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: ఏప్రిల్ రెండో వారం, 2024.

➥ అడ్మిట్ కార్డ్‌ డౌన్‌లోడ్‌: ఏప్రిల్ చివరి వారం, 2024.

➥ రాతపరీక్ష తేది: మే మొదటి వారం, 2024.

➥ రాత పరీక్ష ఫలితాల వెల్లడి: మే చివరి వారం, 2024.

➥ రిసెర్చ్‌ ప్రపోజల్‌ ప్రజెంటేషన్‌, ఇంటర్వ్యూ: జూన్ మూడో వారం, 2024.

➥ ఫలితాల వెల్లడి: జులై రెండో వారం, 2024.

Public Notice

Notification

Online Appilcation

Continues below advertisement