ICAR - AIEEA(PG) 2024: ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ICAR), ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌(AIEEA)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 11న ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్‌, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 13న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఫీజు మాత్రం మే 13న రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చు.


దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1200; ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1100; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.625 చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 29న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు.


వివరాలు..


* ఐసీఏఆర్- ఏఐఈఈఏ పీజీ-2024


విభాగాలు: ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, ఎంటమాలజీ & నెమటాలజీ, అగ్రోనమీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ/ఆగ్రోఫారెస్ట్రీ అండ్ సిల్వికల్చర్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ, వెటర్నరీ సైన్స్, యానిమల్ సైన్సెస్, ఫిషరీస్ సైన్స్, డెయిరీ సైన్స్, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్‌సైన్స్ టెక్నాలజీ, అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్, వాటర్ సైన్స్ & టెక్నాలజీ.


అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్‌, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 31.08.2024 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి.


దరఖాస్తు ఫీజు:  జనరల్ అభ్యర్థులకు రూ.1200; ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1100; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.625.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 480 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 120 నిమిషాలు. పరీక్షలో నెగటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుసమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఇంగ్లిష్ మాధ్యమంలోనే ప్రశ్నలు ఉంటాయి.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష నగరాలు: తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.04.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 11.05.2024 (Upto 05.00 PM)


➥ ఫీజు చెల్లిండానికి చివరితేది: 11.05.2024 (Upto 11.50 PM)


➥ దరఖాస్తుల సవరణ: 13.05.2024 నుంచి 15.05.2024 వరకు.


➥ పరీక్ష తేదీ: 29.06.2024.


Notification


Online Application


Website


ALSO READ:


పరీక్షలపై 'ఫేక్ వార్తలు' నమ్మొద్దు, పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) క్లారిటీ ఇచ్చింది. పరీక్షలకు సంబంధించి వస్తున్న 'ఫేక్ వార్తలు' నమ్మవద్దని స్పష్టంచేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఓటు వేసే అభ్యర్థులకు నీట్ పరీక్ష జరిగే హాలులోకి విద్యార్థులను అనుమతించరని వస్తున్న వార్తలను ఎన్టీఏ ఖండించింది. ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తి వేలిపై ఉన్న 'సిరా' వల్ల పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...