యూజీసీ నెట్‌-2022 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్-2022 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు పరీక్ష సెంటర్ వివరాలకు సంబంధించిన స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే పరీక్ష అడ్మిట్ కార్డులను కూడా ఎన్టీఏ త్వరలోనే విడుదల చేయనుంది.


ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు యూజీసీ నెట్ డిసెంబరు 2022 తొలి విడత పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. మొత్తం 57 సబ్జెక్టుల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏటా రెండుసార్లు ఈ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


యూజీసీనెట్ పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ఇలా పొందండి..


స్టెప్-1: సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి-ugcnet.nta.nic.in


స్టెప్-2: ఆపై అభ్యర్థి హోమ్‌పేజీలో “Advance city intimation for UGC – NET December 2022” లింక్‌పై క్లిక్ చేయండి. 


స్టెప్-3: తర్వాత అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాలి.


స్టెప్-4: ఇప్పుడు అభ్యర్థి యొక్క పరీక్ష కేంద్రం వివరాలు స్క్రీన్ మీద కనబడతాయి.


స్టెప్-5: అభ్యర్థులు తమ ఎగ్జామ్ సెంటర్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.


స్టెప్-6: ఎగ్జామ్ సెంటర్ స్లిప్ ప్రింట్ తీసుకోవాలి. 


UGC NET December Session 2022 - Exam city intimation slip


పరీక్ష విధానం..


➥ ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.


➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.


➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.


యూజీసీ నెట్ డిసెంబరు 2022 నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


విదేశీ వైద్య విద్యార్థులకు అర్హత ధ్రువపత్రం తప్పనిసరి, జూన్‌లో ఎఫ్‌ఎంజీఈ పరీక్ష!
విదేశాల్లో మెడిసిన్ పూర్తిచేసిన విద్యార్థులు భారత్‌లో పీజీలో చేరడానికి లేదా ప్రాక్టీసు చేయడానికి.. వారు ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 'ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజీఈ)'లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షను వచ్చే జూన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. అయితే ఎఫ్‌ఎంజీఈ రాయడానికి ముందుగా విద్యార్థులు ఎన్‌ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రం పొందడం తప్పనిసరి. ఆ ధ్రువపత్రం లేకుండా ఎఫ్‌ఎంజీఈకి చేసుకునే దరఖాస్తులను తిరస్కరిచనున్నట్లు ఎన్‌ఎంసీ ప్రకటించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


Inter Marks: 'ఇంటర్' విద్యార్థులకు అలర్ట్, 'ఎంసెట్' రాయాలంటే ఇన్ని మార్కులు ఉండాల్సిందే!
తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్‌ రాసే అవకాశం కల్పించాలని అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. అయితే జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు ఇంటర్‌ గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో 45 శాతం మార్కులు, అలాగే.. రిజర్వేషన్‌ కేటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు ఉంటేనే ఎంసెట్‌‌కు అర్హులు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..