కాన్పూర్‌లోని నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవతరగతి, ఇంటర్, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు.. 


సీట్ల సంఖ్య: 325.


పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు..


1. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు ఆఫ్ అసోసియేట్‌షిప్‌(షుగర్ టెక్నాలజీ- రెండున్నరేళ్లు): 66 సీట్లు


2. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌(షుగర్ టెక్నాలజీ- ఏడాదిన్నర): 40 సీట్లు


3. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు(ఇండస్ట్రియల్ ఫెర్మెంటేషన్&ఆల్కహాల్ టెక్నాలజీ): 50 సీట్లు


4. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు(షుగర్‌కేన్‌ ప్రొడక్టివిటీ & మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్‌): 20 సీట్లు


5. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు(ఇన్‌స్ట్రుమెంటేషన్ & ప్రాసెస్ కంట్రోల్): 17 సీట్లు


6. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు(క్వాలిటీ కంట్రోల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌): 22 సీట్లు


7. షుగర్ ఇంజినీరింగ్ సర్టిఫికేట్ కోర్సు: 17 సీట్లు


8. షుగర్ బాయిలింగ్ సర్టిఫికేట్ కోర్సు: 63 సీట్లు


9. క్వాలిటీ కంట్రోల్‌లో సర్టిఫికేట్ కోర్సు: 30 సీట్లు


అర్హత: కోర్సును అనుసరించి మెట్రిక్యులేషన్‌, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి. 


ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.


ముఖ్యమైన తేదీలు...


ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 10.04.2023.


ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26.05.2023.


ప్రవేశ పరీక్ష తేదీ: 25.06.2023.



Notification   


Website    


Also Read:


'బయోటెక్నాలజీ'లో పీజీ, జేఆర్‌ఎఫ్ ప్రవేశాలకు నోటిఫికేషన్, పరీక్షలు ఎప్పుడంటే?
బయోటెక్నాలజీ, దాని అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సుల్లో 2023 -24 ప్రవేశాలకు సంబంధించి 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - బయోటెక్నాలజీ (GAT-B) 2023' నోటిఫికేషన్ వెలువడింది. అదేవిధంగా జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే 'బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (BET)-2023' నోటిఫికేషన్‌ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్‌ ద్వారా వివిధ విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
ప్రవేశపరీక్షల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం  'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 202/ జూన్ 2023' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు.
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..