NSD Admissions: న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా 2024-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 10వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌/ ఆడిషన్‌, ఫైనల్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


కోర్సు వివరాలు..


* డ్రామాటిక్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సు (ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌)


విభాగాలు: యాక్టింగ్‌, డిజైన్, డైరెక్షన్‌ ఇతర థియేటర్ సంబంధిత విభాగాలు.


సీట్ల సంఖ్య: 32.


అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్. థియేటర్ ప్రొడక్షన్స్‌లో పార్టిసిపేషన్‌తో పాటు హిందీ/ ఇంగ్లిష్‌ భాషల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.
బోధనా మాధ్యమం: హిందీ/ ఇంగ్లిష్.


వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 


ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్‌/ ఆడిషన్‌, ఫైనల్ టెస్ట్‌ ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..


➥  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.05.2024.


➥ ప్రిలిమినరీ పరీక్ష/ ఆడిషన్ నిర్వహణ తేదీ: మే-జూన్ 2024.


Notification


Online Registration


Website


ALSO READ:


ఐసీఏఆర్ ఏఐఈఈఏ (పీజీ) - 2024 నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా!
ICAR - AIEEA(PG) 2024: ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌(ICAR), ఆలిండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ అడ్మిషన్‌(AIEEA)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 11న ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్‌, బీవీఎస్సీ, బీఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 13న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఫీజు మాత్రం మే 13న రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1200; ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1100; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.625 చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్నవారికి జూన్ 29న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి.


సీపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌-2024 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
CIPET Admission Test - 2024: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్)-2024 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కోర్సు అనుసరించి పదవతరగతి, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. కంప్యూటర్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ పరీక్షను జూన్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించినవారికి జూన్ 14న ప్రవేశపత్రాలు అందజేస్తారు. ఆగస్టు మొదటివారం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..