తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి గాను వివిధ పార్ట్ టైమ్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష/ ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ప్రోగ్రామ్ వివరాలు:
1) పీజీ డిప్లొమా
విభాగాలు: యోగా థెరపీ, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, యోగా విజ్ఞాన, కర్మకాండ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, వెబ్ టెక్నాలజీ.
వ్యవధి: రెండేళ్లు.
2) డిప్లొమా
విభాగాలు: టెంపుల్ కల్చర్, కర్మకాండ, జ్యోతిష అండ్ వాస్తు, ట్రాన్స్‌లేషన్
వ్యవధి: ఏడాది.
3) సర్టిఫికేట్
విభాగాలు: టెంపుల్ కల్చర్, కర్మకాండ, జ్యోతిష, కమ్యూనికేటివ్ అండ్ ఫంక్షనల్ సంస్కృతం, ట్రాన్స్‌లేషన్, మ్యూజిక్ (ఓకల్),డ్యాన్స్ (భరతనాట్యం), సితార్.
వ్యవధి: 6 నెలలు.
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, డిగ్రీ, డిప్లొమా, ఆచార్య, విద్యావారధి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష/ ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 27.08.2023.
ALSO READ:
ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా!
గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 2023 విద్యా సంవత్సరానికి రెండో సెషన్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ ప్రవేశాలకు మరో విడత 'దోస్త్' కౌన్సెలింగ్, స్పెషల్ డ్రైవ్ షెడ్యూలు ఇదే!
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే మూడు దశలో కౌన్సెలింగ్‌తోపాటు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ కూడా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు రౌండ్లలో కలిపి ఇప్పటిదాకా మొత్తం 1,89,046 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారంతా ఆయా కళాశాలల్లో రిపోర్ట్ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా భారీగా సీట్లు మిగలడంతో మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇంజినీరింగ్, నీట్, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నందున విద్యార్థుల సౌకర్యార్థం మరో విడత 'దోస్త్' అడ్మిషన్లను నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈమేరకు నిర్ణయించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఆగస్టు 24 నుంచి 'గేట్-2024' దరఖాస్తుల స్వీకరణ, ఈసారి కొత్త పేపరు జోడింపు!
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) చేపట్టింది. 'గేట్'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది. గేట్-2024 పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..