హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (JNAFAU)లో కొత్త పీజీ (మాస్టర్స్) కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఎనర్జీ అండ్‌ సస్టైనబుల్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ పేరుతో కొత్త మాస్టర్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు శనివారం నాడు ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. 


తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి విద్యాసంస్థ ఇదేనని వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.కవితా దర్యాణిరావు తెలిపారు. 
ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమ, సబ్జెక్ట్‌ నిపుణుల సహకారంతో ఈ కోర్సును రూపొందించబడిందని, కోర్సులో 20 మందికి ప్రవేశాలను కల్పించనున్నట్లు తెలిపారు.


గ్రీన్‌ బిల్డింగ్‌ అనలిస్ట్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ స్పెషలిస్ట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ పాలసీ అడ్వైజర్‌, ఎనర్జీ ఎఫిషియెంట్‌ మేనేజర్‌, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, స్టసనబుల్‌ మెటీరియల్స్‌ రీసెర్చర్‌, కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ అనలిస్ట్‌, క్లైమేట్‌ రెసిలెన్స్‌ ప్లానర్‌, స్టసనబిలిటీ స్పెషలిస్ట్‌, స్టసనబిలిటీ, రీజనరేషన్‌ మేనేజర్‌, నెట్‌ జీరో ఎనర్జీ కన్సల్టెంట్‌ మరియు ఎనర్జీ పాలసీ అనలిస్ట్‌ వంటి అంశాలను విద్యార్థులు నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.


ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి కోర్సు అవసరమని, అడ్మిషన్లను తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అడ్మిషన్లు పొందాలనే అభ్యర్థులకు బీ.టెక్‌ లేదా బి.డిజైన్‌ లేదా బి.ఆర్క్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ అర్హత ఉండి, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ అర్హత కలిగి ఉండాలని ఆమె తెలిపారు. 


ALSO READ:


డిగ్రీ ప్రవేశాలకు మరో విడత 'దోస్త్‌' కౌన్సెలింగ్, స్పెషల్‌ డ్రైవ్‌ షెడ్యూలు ఇదే!
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే మూడు దశలో కౌన్సెలింగ్‌తోపాటు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ కూడా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు రౌండ్లలో కలిపి ఇప్పటిదాకా మొత్తం 1,89,046 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారంతా ఆయా కళాశాలల్లో రిపోర్ట్‌ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా భారీగా సీట్లు మిగలడంతో మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇంజినీరింగ్‌, నీట్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నందున విద్యార్థుల సౌకర్యార్థం మరో విడత 'దోస్త్‌' అడ్మిషన్లను నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈమేరకు నిర్ణయించింది. 
వివరాల కోసం క్లిక్ చేయండి..


TS ICET: టీఎస్ ఐసెట్‌-2023 కౌన్సెలింగ్‌ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తదనంతరం సెప్టెంబరు 8 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్లను సెప్టెంబర్‌ 17న కేటాయించనున్నారు. సెప్టెంబరు 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తాంచనున్నారు. సెప్టెంబరు 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 29న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. 
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..