National Institute of Rural Development and Panchayati Raj Admissions: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ అర్హత ఉన్నవారు కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా CAT/XAT/MAT/ CMAT / GMAT/ ATMA  ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. జులై 15లోగా డిగ్రీ చివరి సంవత్సరం పూర్తిచేసే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నిర్ణీత అర్హత పరీక్షల స్కోరు ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.


కోర్సుల వివరాలు..


1) పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-రూరల్ మేనేజ్‌మెంట్ (PGDM-RM) 2024-26 బ్యాచ్


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ అర్హత ఉన్నవారు కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు CAT/XAT/MAT/ CMAT / GMAT/ ATMA  ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. 


2) పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ (PGDRDM) 2024-25 బ్యాచ్


కోర్సు వ్యవధి: ఏడాది.


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ అర్హత ఉన్నవారు కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 


కోర్సు ఫీజు: రూ.2,20,500.


దరఖాస్తు ఫీజు: రూ.400. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: సరైన అర్హతల ఆధారంగా ఎంపిక (షార్ట్‌ లిస్టింగ్‌) చేసిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.


స్కాలర్‌షిప్స్..


* త్రైమాసిక పరీక్షలో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా NIRDPR పాలసీ ప్రకారం స్కాలర్‌షిప్ పొందే అవకాశం ఉంటుంది.


* ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్, షిల్లాంగ్ ఫెలోషిప్ అందిస్తోంది.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.04.2024.


PGDM-RM Notification


PGDRDM Notification


PGDM-RM/PGDRDM Application


Website


ALSO READ:


ఓయూలో దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE) 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు టీఎస్‌ఐసెట్/ఏపీ ఐసెట్ అర్హత తప్పనిసరి. వేదిక్ ఆస్ట్రాలజీ కోర్సుకు సంబంధిత విభాగంలో డిప్లొమా/పీజీ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా మార్చి 31 వరకు  దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...