హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ 2023-24 విద్యా సంవత్సరానికి డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబరు 30లోగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  


వివరాలు..


➥ డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్


సీట్ల సంఖ్య: 30 సీట్లు


అర్హత: బీఎస్సీ(అగ్రికల్చర్/ హార్టికల్చర్/ లైఫ్ సైన్సెస్/ అగ్రికల్చర్ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) లేదా బీటెక్‌ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.


➥ పీజీ డిప్లొమా - ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌


సీట్ల సంఖ్య: 30 సీట్లు


అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్/ అగ్రికల్చర్ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) లేదా బీఈ, బీటెక్‌ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్)/ ఎంఎస్సీ(లైఫ్ సైన్సెస్‌) ఉత్తీర్ణులై ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.200. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆఫ్‌లైన్ విధానాల్లో.


ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు...


➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 30.09.2023.


➥ రాత పరీక్షతేది: 16.10.2023.


➥ తరగతులు ప్రారంభం: 01.11.2023.


Notification


Online Registration


Website


ALSO READ:


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్, అర్హతలివే!
కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, 2024-25 విద్యా సంవత్సరానికిగానను సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మేనేజర్ స్థాయిలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. (లేదా) పీజీ (ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, మెడిసిన్, ఫార్మాస్యూటికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్)తో పాటు సంబంధిత రంగంలో మేనేజర్ స్థాయిలో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నవంబరు 15లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...