AP TET July 2024 Applications: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు గడువు ఆగస్టు 3తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్ష కోసం మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆగస్టు 5న పాఠశాల విద్యాశాఖ వివరాలు వెల్లడించింది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.  పరీక్ష హాల్‌టికెట్లను సెప్టెంబరు 22 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. 


అందిన దరఖాస్తులు ఇలా..
➥ ఎస్‌జీటీ విభాగంలో పేపర్ 1-ఎకు 1,82,609 మంది; ఎస్‌జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) పేపర్ 1- బికు 2,662 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 


➥ స్కూల్ అసిస్టెంట్ టీచర్ విభాగంలో పేపర్ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది; మ్యాథ్స్, సైన్స్‌కు కలిపి మొత్తం 1,04,788 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.


➥ సోషల్ స్టడీస్‌కు సంబంధించి 70,767 మంది, స్కూల్ అసిస్టెంట్ టీచర్(స్పెషల్ ఎడ్యుకేషన్) పేపర్ 2- బి విభాగంలో 2,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 


పరీక్ష విధానం..
ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు.


➥ పేపర్-1 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.


➥ పేపర్-1 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.


➥ పేపర్-2 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్/బయాలజీ/ఫిజిక్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.


➥ పేపర్-2 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, కేటగిరీ ఆఫ్ డిజెబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి -60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 60 మార్కులు, బీసీలకు  50 మార్కులు, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతం ఉంటే సరిపోతుంది.


ముఖ్యమైన తేదీలు...


➥ ఏపీటెట్ జులై -2024 నోటిఫికేషన్ వెల్లడి: 02.07.2024.


➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 03.07.2024 -03.08.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.07.2024 -03.08.2024.


➥ ఆన్‌లైన్ మాక్ టెస్టులు అందుబాటులో: 19.09.2024 నుంచి.


➥ టెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 22.09.2024 నుంచి 


➥ టెట్ పరీక్ష షెడ్యూలు: 03.10.2024 - 20.10.2024.  {పేపర్-1(ఎ) & పేపర్-1(బి), పేపర్-2(ఎ) & పేపర్-2(బి)}


➥ పరీక్ష సమయం..


సెషన్-1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.


సెషన్-2: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు


➥ టెట్ ప్రాథమిక 'కీ' విడుదల: 04.10.2024.


➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 05.10.2024 నుంచి.


➥ టెట్ ఫైనల్ కీ: 27.10.2024.

➥ టెట్ ఫలితాల వెల్లడి: 02.11.2024.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..